PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-no-chance-to-win-in-yanamala-own-constituency-89159a72-f47d-4f6a-b40a-d1386c5b622e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/tdp-have-no-chance-to-win-in-yanamala-own-constituency-89159a72-f47d-4f6a-b40a-d1386c5b622e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణ జరగాలని విపక్షాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎన్నికల నిర్వహణ జరగకుండా ప్రభుత్వం అడ్డుకోవడం ఎంత మాత్రం భావ్యం కాదని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరం అయితే సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్తామని ఉద్యోగులు కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపిలో పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించ రాదు అని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణమే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలి అని డిమాండ్ చేసారు. ఆర్టికల్ 243yanamala ramakrishndu, tdp, ap;ramakrishna;jagan;andhra pradesh;governor;tdp;local language;june;reddy;mantraఎన్నికల గోలలో గవర్నర్...!ఎన్నికల గోలలో గవర్నర్...!yanamala ramakrishndu, tdp, ap;ramakrishna;jagan;andhra pradesh;governor;tdp;local language;june;reddy;mantraSun, 10 Jan 2021 16:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణ జరగాలని విపక్షాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎన్నికల నిర్వహణ జరగకుండా ప్రభుత్వం అడ్డుకోవడం ఎంత మాత్రం భావ్యం కాదని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరం అయితే సుప్రీం కోర్ట్ కి కూడా వెళ్తామని ఉద్యోగులు కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపిలో పరిణామాలపై గవర్నర్ ఉపేక్షించ రాదు అని ఆయన వ్యాఖ్యానించారు. తక్షణమే రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలి అని డిమాండ్ చేసారు.

ఆర్టికల్ 243ఏ, ఆర్టికల్ 243కె(1) ప్రకారం ఎన్నికల నిర్వహణ అధికారం ఈసిదే అని ఆయన అన్నారు. పంచాయితీ ఎన్నికలకు కావాల్సిన ఉద్యోగులను కేటాయించేలా చూడాల్సింది గవర్నరే అని ఆయన స్పష్టం చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె(3) చెబుతోంది ఇదే అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఆర్టికల్ 356ను అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని మంత్రులు చెప్పడం దేశచరిత్రలో లేదు అని ఆయన విమర్శించారు.

ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పడం ఏ రాష్ట్రంలోనూ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం క్యూల నిర్వహణకు లేని అభ్యంతరాలు, పంచాయితీ ఎన్నికలకు ఉంటాయా..? అని ఆయన నిలదీశారు. కోవిడ్ ప్రభావం ఉందని 2022 జూన్ దాకా స్థానిక ఎన్నికలు జరపరా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలపై దాడులు, అన్నివర్గాల ప్రజలపై దౌర్జన్యాలు, చివరికి ఆలయాల ధ్వంసాలు... ప్రజల్లో ఆగ్రహం చూసే ఎన్నికల నిర్వహణకు సిఎం జగన్ రెడ్డి ఆటంకాలు అని ఆయన ఆరోపించారు. స్థానిక ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం జగన్ రెడ్డి అండ్ కో కు లేకనే ఈ జగన్నాటకం అని ఆయన విమర్శించారు. వైకాపా ప్రభుత్వ రాజ్యాంగ ధ్వంసం(కానిస్టిట్యూషన్ బ్రేక్ డౌన్)ను అడ్డుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. శాంతియుతంగా పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి అని కోరారు.


అధిష్టానంపై ఎమ్మెల్యే ఫైర్... నన్ను పట్టించుకోవట్లేదని ఆవేదన

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>