PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vangaveeti-radha-ysrcp56bac685-b1ce-4cc5-8de4-7dec78cd338b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/vangaveeti-radha-ysrcp56bac685-b1ce-4cc5-8de4-7dec78cd338b-415x250-IndiaHerald.jpg దీంతో ఎమ్మెల్యే అనుచ‌రులు రాధా అనుచ‌రుల‌ను త‌ప్పుకోవాల‌ని చెప్ప‌డంతో మొద‌లైన వివాదం కాస్తా పెరిగి పెద్ద‌దిగా మారింది. చివ‌ర‌కు రెండు వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు ఘ‌ర్ష‌ణ ప‌డ‌డంతో పాటు దాడులు కూడా చేసుకున్నారు. రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ పెరిగి పెద్ద‌ది కావ‌డంతో చివ‌ర‌కు పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌రిస్థితి చ‌క్క‌దిద్దారు. వంగ‌వీటి అనుచ‌రులు పేట్రేగిపోయి వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు అబ్బ‌య్య చౌద‌రి వ‌ర్గంపై దాడులు చేయ‌డంతో ఎమ్మెల్యే వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలైన‌ట్టు తెలుస్తోంది. చివvangaveeti radha ysrcp;vedhika;krishna river;district;police;car;mla;chennai;cheque;letter;ycpవంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!vangaveeti radha ysrcp;vedhika;krishna river;district;police;car;mla;chennai;cheque;letter;ycpSun, 10 Jan 2021 14:59:58 GMTకృష్ణా జిల్లాలో అనుకోకుండా జ‌రిగిన ఓ వివాదం కాస్త పెద్ద ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. జిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని హ‌నుమాన్ జంక్ష‌న్ ఇందుకు వేదిక అయ్యింది. ఈ వివాదంలో టీడీపీకే చెందిన కాపు నేత వంగ‌వీటి రాధా అనుచ‌రుల‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బ‌య్య చౌద‌రి వ‌ర్గాలు కోట్లాట‌కు దిగారు. జాతీయ ర‌హదారి మీదే ఈ రెండు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం క‌ల‌బ‌డ్డాయి. ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ త‌మ అనుచ‌రుల వాహ‌నాల‌తో పాటు త‌మ వాహ‌నాల్లో క‌ల‌క‌త్తా - చెన్నై జాతీయ ర‌హ‌దారిపై ఏలూరు నుంచి విజ‌య‌వాడ వైపు వెళుతున్నాయి.

ఈ ఇద్ద‌రు నేత‌ల వాహ‌నాలు చాలా స్పీడ్‌గా వెళ్లే క్ర‌మంలో ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి అనుచ‌రుల‌కు చెందిన వాహ‌నాలు కాస్త వేగంగా ముందుకు వెళ్లాయట‌. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే వాహ‌నం మ‌ధ్య‌లోనే ఉండిపోయింది. దీంతో ఎమ్మెల్యే అనుచ‌రులు రాధా అనుచ‌రుల‌ను త‌ప్పుకోవాల‌ని చెప్ప‌డంతో మొద‌లైన వివాదం కాస్తా పెరిగి పెద్ద‌దిగా మారింది. చివ‌ర‌కు రెండు వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు ఘ‌ర్ష‌ణ ప‌డ‌డంతో పాటు దాడులు కూడా చేసుకున్నారు.

రెండు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ పెరిగి పెద్ద‌ది కావ‌డంతో చివ‌ర‌కు పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌రిస్థితి చ‌క్క‌దిద్దారు. వంగ‌వీటి అనుచ‌రులు పేట్రేగిపోయి వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు అబ్బ‌య్య చౌద‌రి వ‌ర్గంపై దాడులు చేయ‌డంతో ఎమ్మెల్యే వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు కార్య‌క‌ర్త‌ల‌కు గాయాలైన‌ట్టు తెలుస్తోంది. చివ‌ర‌కు ఈ గొడ‌వ‌కు చెక్ పెట్టేందుకు అటు అబ్బ‌య్య చౌద‌రి, ఇటు వంగ‌వీటి క‌లిసి ఒకే కారులో విజ‌య‌వాడ వైపు వెళ్లారు. చివ‌ర‌కు వీరిద్ద‌రు ఒకే కారులో వెళ్ల‌డంతో వారి వారి అనుచ‌రులు కాస్త శాంతించారు.

ఏదేమైనా ఇలాంటి గొడ‌వ‌లు జ‌రిగిన‌ప్పుడు రెండు వ‌ర్గాలు కాస్త సంయ‌మ‌నం పాటిస్తే స‌రిపోతుంది. అన‌వ‌స‌రంగా కోపావేశాల‌కు పోకుండా కూల్ గా ఉంటే ప‌రిస్థితి స‌ద్దుమ‌ణుగుతుందన్న విష‌యం అంద‌రూ తెలుసు కోవాలి. 


ఐరన్ లెగ్ శాస్త్రి. ఈ ఒక్క పేరు ఈ నటుడిని అనాధ శవంగా రిక్షాలో వచ్చేలా చేసింది

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!

భార‌త్ దాడి.. 300మంది ఉగ్ర‌వాదులు హ‌తం

ట్రంప్ వీరంగం..డ్రెమోక్రాంట్ల దిమ్మ తిరిగే ఆలోచ‌న‌...

కేజీయఫ్‌ ‘అధీర’ పాత్ర గురించి ఈ విషయం మీకు తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>