PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deaddc884931-bdbd-41f7-97cb-9796576bc840-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/deaddc884931-bdbd-41f7-97cb-9796576bc840-415x250-IndiaHerald.jpgఉన్నత చదువులు చదివి సొంతంగా కంపెనీ పెట్టాడు ఓ యువకుడు (30 ఏళ్లు). కొన్ని కంపెనీలు అతడి చేతి కింద పని చేస్తున్నాయి. అంతా బాగుందని.. సెటిల్‌ అయ్యాడని కుటుంబసభ్యులు సరిగ్గా 45 రోజుల కిందట పెళ్లి కూడా చేశారు. పెళ్లి తంతు ముగిశాక భార్యభర్తలిద్దరూ కలిసి బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడు కంపెనీలో పని ఉందని, మీరు ఇంటికి వెళ్లండని చెప్పి బయలుదేరిపోయాడు.dead;rbi;police;marriage;car;husband;wife;murder.;duvvuruకంపెనీ పని ఉందని చెప్పి.. తిరిగి రాని లోకానికి..!కంపెనీ పని ఉందని చెప్పి.. తిరిగి రాని లోకానికి..!dead;rbi;police;marriage;car;husband;wife;murder.;duvvuruSun, 10 Jan 2021 18:00:00 GMTపెళ్లి కూడా చేశారు. పెళ్లి తంతు ముగిశాక భార్యభర్తలిద్దరూ కలిసి బంధువుల ఇంటికి కారులో వెళ్లారు. అక్కడికి వెళ్లాక ఆ యువకుడు కంపెనీలో పని ఉందని, మీరు ఇంటికి వెళ్లండని చెప్పి బయలుదేరిపోయాడు. భార్యకు ఫోన్‌ చేసిందేలేదు. అలా వెళ్లిన భర్త ఎంతకీ తిరిగి రాలేదు.

అనుకోకుండా ఓ రోజు యువకుడి స్నేహితుడి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘‘మీ భర్త చనిపోయాడట.. రైల్వే ట్రాక్‌పై మృతదేహం పడి ఉందట. నాకు పోలీసులు ఇందాకే ఫోన్‌ చేసి చెప్పారు. కాంటాక్ట్‌ లిస్ట్‌లో నా పేరును చూసి నన్ను సంప్రదించారు.’’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న అతడి భార్య ఒక్కసారిగా కుప్పకూలింది.

ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూరుకు చెందిన డాకా సాయినాథ్‌రెడ్డి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును పూర్తి చేశాడు. సొంతంగా హైదరాబాద్‌లో ఒక షేర్‌ కంపెనీని నిర్వహిస్తున్నాడు. కొడుకు సెటిల్‌ అయ్యాడని తల్లిదండ్రులు గతేడాది నవంబర్‌ 25వ తేదీన వరంగల్‌కు చెందిన జ్యోత్స్నతో వివాహం జరిగింది. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌లోనే కాపురం పెట్టారు.

ఈ నెల 7వ తేదీన చందానగర్‌లో ఉంటున్న మేనత్త గిరిజమ్మ ఇంటికి భార్యభర్తలిద్దరూ కలిసి వెళ్లారు. అక్కడ జ్యోత్స్నను వదిలి పెట్టి.. కంపెనీలో పని ఉంది.. బ్యాంకుకు వెళ్లాలి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి.. పనులు పూర్తయ్యాక 11వ తారీఖున ఇంటికి వస్తాను.. అని చెప్పి కారులో దువ్వూరుకు బయలుదేరాడు. అలా వెళ్లిన సాయినాథ్‌రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. కాల్‌ చేస్తే ఫోన్‌ స్విచ్ఛాప్‌గా వచ్చింది.

శనివారం నాడు అతడి స్నేహితుడు జ్యోత‍్స్నకు ఫోన్‌ చేసి సాయినాథ్‌రెడ్డి చనిపోయాడని, కర్ణాటకలోని బీజాపూర్‌ రైల్వేట్రాక్‌పై మృతదేహం ఉందని.. అక్కడి పోలీసులు ఫోన్‌ సమాచారం ఆధారంగా కాల్‌ చేశాడని చెప్పాడు. రైల్వేట్రాక్‌ సమీపంలోనే సాయినాథ్‌రెడ్డి బైకు ఉండటం, అక్కడి ఆనవాళ్లు బట్టి ఎవరైనా హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దీనికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.


పెళ్లి చేసుకోండని చెబుతున్నా పట్టడం లేదు..!

షాకింగ్: సొంత పార్టీ పెడుతున్న ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలు

కేంద్రాన్ని ఇరుకున పెట్టిన జగన్...మోడీకి ఇక తప్పదు...!

వంగ‌వీటి రాధా కారులో వైసీపీ ఎమ్మెల్యే.. రోడ్డుపైనే ర‌చ్చ ర‌చ్చ‌...!

ఉదయం కూలిన విమానం.. సాయంత్రం విరిగిపడిన కొండచరియలు..

బర్డ్ ఫ్లూ వస్తే ఎన్నికలు పెడతారా...? ఏపీ ఉద్యోగుల ఫైర్

ష‌ర్మిల‌కు ఆ సీటు ఫిక్స్ చేసిన జ‌గ‌న్‌... ఆ సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ త‌ప్ప‌దు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>