PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine4cca7a08-082f-40ba-b555-6d974a14d744-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-vaccine4cca7a08-082f-40ba-b555-6d974a14d744-415x250-IndiaHerald.jpgకరోనా టీకా వస్తున్నా.. ఇంకా జనంలో పూర్తిగా భయం తొలగిపోలేదు.. ఇక ఇండియాలో త్వరగానే వ్యాక్సీన్ వస్తోంది. జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం అవుతోంది. అయితే ఇది అందరికీ కాదు.. కరోనా యోధులకు మాత్రమే.. సాధారణ ప్రజలకు టీకా రావాలంటే ఇంకా సమయం పడుతుంది. అయితే.. అలా టీకా వస్తుందో లేదో.. అప్పుడే మోసగాళ్లు తయారయ్యారు. ఇదిగో కరోనా టీకా కోసం బుక్ చేసుకోండి అంటూ లింకులు పంపుతున్నారు. ఆ లింకులు ఓపెన్‌ చేస్తే.. ఖాతాల్లో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. అందుకే కరోనా వ్యాక్సిన్ పేరుతో లింకులు వస్తే ఓపెన్ చేయకండcorona-vaccine;police;january;bankవామ్మో.. కరోనా పేరుతో ఇలాంటి మోసాలా.. జాగ్రత్తగా ఉండకపోతే మీ జేబు లూటీ..!?వామ్మో.. కరోనా పేరుతో ఇలాంటి మోసాలా.. జాగ్రత్తగా ఉండకపోతే మీ జేబు లూటీ..!?corona-vaccine;police;january;bankSat, 09 Jan 2021 23:00:00 GMTజనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం అవుతోంది. అయితే ఇది అందరికీ కాదు.. కరోనా యోధులకు మాత్రమే.. సాధారణ ప్రజలకు టీకా రావాలంటే ఇంకా సమయం పడుతుంది. అయితే.. అలా టీకా వస్తుందో లేదో.. అప్పుడే మోసగాళ్లు తయారయ్యారు. ఇదిగో కరోనా టీకా కోసం బుక్ చేసుకోండి అంటూ లింకులు పంపుతున్నారు.

ఆ లింకులు ఓపెన్‌ చేస్తే.. ఖాతాల్లో డబ్బులు ఖాళీ అవుతున్నాయి. అందుకే కరోనా వ్యాక్సిన్ పేరుతో లింకులు వస్తే ఓపెన్ చేయకండి.. అలాంటివి ఏమీలేవు.. ప్రభుత్వమే వ్యాక్సిన్‌ వేస్తుంది. ఈ మేరకు పోలీసులు  కూడా అలర్ట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి దగుల్బాజీలు కేవలం ఇండియాలోనే కాదండోయ్.. లండన్‌లోనూ ఉన్నారట. తాజాగా బ్రిటన్‌లో కరోనా టీకా పేరుతో  సైబర్‌ నేరగాళ్లు కొత్తతరహా మోసానికి తెర లేపారట. వృద్ధులు, వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నవారిని టార్గెట్ చేస్తున్నారట. వారిని టీకా పేరుతో సులభంగా మోసాలు చేస్తున్నట్లు బ్రిటన్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది.

కరోనా టీకాల పేరుతో జరిగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్రిటన్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ వార్నింగ్ ఇచ్చింది. చెబుతోంది. కరోనా టీకాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు బ్యాంక్ వివరాలు, నగదు చెల్లించాలని సైబర్‌ మోసగాళ్లు అడుగుతున్నట్లు బ్రిటన్‌ నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ వివరాలు చెబుతోంది. అయితే అప్రమత్తమైన బ్రిటన్‌ పోలీసులు ఈ తరహా మోసాలపై గట్టి నిఘా పెట్టారు.

చూశారుగా.. అందుకే మీరూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా వ్యాక్సిన్లను ప్రభుత్వమే ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించింది. అందుకే తస్మాత్‌ జాగ్రత్త.. కరోనా టీకా అంటూ మొబైల్‌ కు సందేశాలు పంపినా.. కాల్స్ చేసినా సులభంగా మోసకండి.. బీ అలర్ట్.




ఏంటి..... ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న డేట్ ని .... కెజిఎఫ్ 2 కి ఫిక్స్ చేసారా .....??

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>