Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gang-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/gang-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి భారతదేశం లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలయ్యిందీ అంటే ఇక క్రికెట్ ప్రేక్షకులందరికీ క్రికెట్ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఎప్పుడు ఎప్పుడు ఐపీఎల్ మొదలవుతుందా అని అటు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. అయితే గత ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తారా లేదా అన్న దానిపై అనుమానాలు నెలకొన్నప్పటికీ కఠిన నిబంధనల మధ్య బిసిసిఐ యూఏఈ వేదికganguli;cricket;january;sourav ganguly;bcci;indianఐపీఎల్ కోసం.. ఆసుపత్రి బెడ్ పై నుంచే కీలక నిర్ణయం తీసుకున్న సౌరవ్ గంగూలి..?ఐపీఎల్ కోసం.. ఆసుపత్రి బెడ్ పై నుంచే కీలక నిర్ణయం తీసుకున్న సౌరవ్ గంగూలి..?ganguli;cricket;january;sourav ganguly;bcci;indianSat, 09 Jan 2021 10:00:00 GMTక్రికెట్ నియంత్రణ మండలి నిర్వహించే  ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి భారతదేశం లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలయ్యిందీ అంటే ఇక క్రికెట్ ప్రేక్షకులందరికీ క్రికెట్ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఎప్పుడు ఎప్పుడు ఐపీఎల్ మొదలవుతుందా అని అటు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులందరూ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తారు. అయితే గత ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తారా లేదా అన్న దానిపై అనుమానాలు నెలకొన్నప్పటికీ కఠిన నిబంధనల మధ్య బిసిసిఐ యూఏఈ వేదికగా నిర్వహించిన విషయం తెలిసిందే.


 ఇకపోతే ఈ ఏడాది కూడా ఐపీఎల్ నిర్వహించేందుకు ఇప్పటికే బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది ఇక శరవేగంగా దీనిపై ప్లానింగ్ కూడా సిద్ధం చేస్తుంది బిసిసిఐ. దీని కోసం ఇప్పటికే వరుసగా సమావేశాలు కూడా జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కాగా  జనవరి 4వ తేదీన బీసీసీఐ బోర్డు పాలక మండలి సమావేశం జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదే సమయంలో ఊహించని విధంగా బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కి గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో అక్కడ ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు దీంతో కొన్ని రోజులపాటు ఆస్పత్రిలోనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.



 అయితే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అటు హాస్పిటల్ లో రెస్ట్ తీసుకుంటున్నప్పటికి కూడా జనవరి 4వ తేదీన జరగాల్సి ఉన్నా బీసీసీఐ  బోర్డు పాలక మండలి సమావేశం వాయిదా పడకూడదు అనే ఉద్దేశంతోనే ఇక ఆస్పత్రిలో నుంచే మీటింగ్ లో పాల్గొన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.  పాలక మండలి సభ్యులు అందరితో కలిసి వర్చువల్ ద్వారా సౌరవ్ గంగూలీ ఆసుపత్రి బెడ్ పై నుంచి సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలోనే సౌరవ్ గంగూలి ఇలా కాస్త కష్టం అయినప్పటికీ ఆసుపత్రి బెడ్ పై నుంచి  బిసిసిఐ బోర్డు కమిటీ మీటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.


రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసిన త్రివిక్రం..?

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>