MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suddenly-married-night-after-night-telugu-actress-who-shocked-everyone38e6f52a-d4ec-484b-bb7a-7d70abff16b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suddenly-married-night-after-night-telugu-actress-who-shocked-everyone38e6f52a-d4ec-484b-bb7a-7d70abff16b8-415x250-IndiaHerald.jpgబస్ స్టాఫ్ చిత్రంతో వరంగల్‌కు చెందిన ఆనంది టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో కొన్ని చిన్న చిన్న చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆశించిన స్థాయిలో సినిమాలు రాకపోయినప్పటికి తమిళంలో మాత్రం ఆనందికి వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. తమిళ చిత్రం పొరియాళన్ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆనంది మొదటి చిత్రంతోనే అక్కడ మంచి మార్కులను సంపాదించింది. దీంతో అక్కడ అమ్మడుకు వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. married;nayantara;apple;tollywood;cinema;telugu;tamil;marriage;letter;european union;custard apple;reddy;titanic;chitramరాత్రికి రాత్రి అకస్మాత్తుగా పెళ్లి.. అందరికి షాకిచ్చిన తెలుగు నటిరాత్రికి రాత్రి అకస్మాత్తుగా పెళ్లి.. అందరికి షాకిచ్చిన తెలుగు నటిmarried;nayantara;apple;tollywood;cinema;telugu;tamil;marriage;letter;european union;custard apple;reddy;titanic;chitramSat, 09 Jan 2021 14:47:53 GMTబస్ స్టాఫ్ చిత్రంతో వరంగల్‌కు చెందిన ఆనంది టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో కొన్ని చిన్న చిన్న చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆశించిన స్థాయిలో సినిమాలు రాకపోయినప్పటికి తమిళంలో మాత్రం ఆనందికి వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. తమిళ చిత్రం పొరియాళన్ అనే చిత్రంతో కోలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆనంది మొదటి చిత్రంతోనే అక్కడ మంచి మార్కులను సంపాదించింది. దీంతో అక్కడ అమ్మడుకు వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. చండీవరన్, కయల్, కడవుల్ ఇరుక్కాన కుమారు, పరియేరుం పెరుమాళ్, త్రిషా ఇల్లెన్నా నయనతార, ఇరండాం ఉలగోరిన్ కడైసి గుండు, విచారణై తదితర చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ ఇండస్ట్రీలో బిజీ నటిగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించగా ఆ చిత్రాలు త్వరలోనే విడుదల కానున్నాయి. అల్లా వుద్దీన్ అర్బుద కెమెరా, టైటానిక్ కాదలుమ్ కవిళిందు పోగుమ్ చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇక తెలుగులో ఇటీవల జాంబీ రెడ్డి అనే చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా ఆనంది కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఆనంది ఒక్కసారిగా పెళ్లి పీటలెక్కి అందరికి షాకిచ్చింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే ఆనంది వివాహమాడింది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సోక్రటీస్ అనే వ్యక్తిని పెద్దల అంగీకారంతో ఆనంది పెళ్లి చేసుకుంది. వీరి వివాహం గురువారం వరంగల్‌లో ఘనంగా జరిగింది.

కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయినట్టు తెలుస్తోంది. అసలు ఆనంది ఇంత అకస్మాత్తుగా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి పెళ్లి తరువాత ఆనంది సినిమాల్లో నటిస్తుందా అనే దానిపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఆమె చేతిలో కనీసం ఐదు సినిమాలైనా ఉంటాయి. ఆ సినిమాలు అయితే ఆమె కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ చిత్రాలన్ని పూర్తి చేసే లోపు కనీసం రెండేళ్లు అయినా పడుతుంది. మరి ఈ లోపు కొత్త చిత్రాలకు ఆనంది సైన్ చేస్తుందో లేదో చూడాలి.


కేజీఎఫ్ 2 టీజర్ లో జరిగిన తప్పులు.. ఏంటో తెలుసా?

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>