Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurushfe774f8b-b9ca-49a5-80c2-4fa0aefc1cf5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-adipurushfe774f8b-b9ca-49a5-80c2-4fa0aefc1cf5-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ హౌజ్ లో సైలెంట్ గా ఉండి ఏకంగా టైటిల్ కే ఎసరు పెట్టాడు అభిజిత్. మిస్టర్ కూల్, మిస్టర్ మెచ్యూర్డ్ అంటూ బయటకు వచ్చాక తనకు తెలియని పేర్లని పెట్టి మరి అతన్ని పొగిడేశారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రిఫరెన్స్ తోనే అతన్ని గుర్తు పడుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 ఆ ఐడెంటిటీని మార్చేసింది. సీజన్ 4 టైటిల్ విన్నర్ గా అభిజిత్ తన సత్తా చాటాడు. అంతేకాదు ఈ క్రేజ్ తో హీరోగా మరోసారి తన కెరియర్ ను సరైన ట్రాక్ లో పెట్టాలని చూస్తున్నాడు.abhijeet;abhijith;prema;cinema;bigboss;love;winner;winner1;success;mass;beautiful;misterఅభిజిత్ మాస్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యేనా..!అభిజిత్ మాస్ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యేనా..!abhijeet;abhijith;prema;cinema;bigboss;love;winner;winner1;success;mass;beautiful;misterSat, 09 Jan 2021 23:56:51 GMTబిగ్ బాస్ హౌజ్ లో సైలెంట్ గా ఉండి ఏకంగా టైటిల్ కే ఎసరు పెట్టాడు అభిజిత్. మిస్టర్ కూల్, మిస్టర్ మెచ్యూర్డ్ అంటూ బయటకు వచ్చాక తనకు తెలియని పేర్లని పెట్టి మరి అతన్ని పొగిడేశారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రిఫరెన్స్ తోనే అతన్ని గుర్తు పడుతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 ఆ ఐడెంటిటీని మార్చేసింది. సీజన్ 4 టైటిల్ విన్నర్ గా అభిజిత్ తన సత్తా చాటాడు. అంతేకాదు ఈ క్రేజ్ తో హీరోగా మరోసారి తన కెరియర్ ను సరైన ట్రాక్ లో పెట్టాలని చూస్తున్నాడు.

అభిజిత్ క్యారక్టర్ కు తగినట్టుగా మంచి ప్రేమ కథలతో అతని దగ్గరకు వస్తున్నారట. కాని అభిజిత్ వాటిని కాకుండా కొత్త కథలు.. కొద్దిగా మాస్ కథలు తీసుకు రమ్మని చెబుతున్నాడట. అభిజిత్ ఇదివరకు ఇమేజ్ వేరు కాని తన బిగ్ బాస్ ఫాలోవర్స్ సలహా మేరకు అతను మాస్ అటెంప్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. కూల్ గా ఉండే అభిజిత్ మాస్ సినిమా చేస్తేనే చూస్తారని అంటున్నారు. ఇప్పటికే రెండు కథలు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు చాలామంది దర్శకులు కూడా అభిజిత్ కు స్టోరీ వినిపించాలని చూస్తున్నారట.

బిగ్ బాస్ వల్ల వచ్చిన ఈ క్రేజ్ తో కెరియర్ ను సెట్ రైట్ చేసుకోవాలని చూస్తున్నాడు అభిజిత్. అంతేకాదు ఈసారి సాఫ్ట్ ఇమేజ్ కాకుండా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడట. పైకి కనిపించడు కాని అభిజిత్ లో కూడా మాస్ యాంగిల్ బోలెడంత ఉందని హౌజ్ మేట్స్ అన్నారు. అఫ్కోర్స్ షో చూసిన ఆడియెన్స్ కు ఆ విషయం తెలిసిందే. కాబట్టి అభిజిత్ ను ఇక మీదట కొత్తగా చూడబోతున్నాం అన్నది మాత్రం అర్ధమవుతుంది. లేట్ చేయకుండా మంచి సినిమాతో వస్తే ఇదే వేడి మీద సక్సెస్ ట్రాక్ కూడా ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు అభిజిత్ ఫ్యాన్స్.




వకీల్ సాబ్ డైలాగ్స్‌తోనే పడగొట్టేస్తాడా?

కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>