PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/humiliated54ef9594-9481-42bd-b4ab-8057cc6fe746-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/humiliated54ef9594-9481-42bd-b4ab-8057cc6fe746-415x250-IndiaHerald.jpgహైదరాబాద్: తెలంగాణలో బీజేపీ దూసుకెళ్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాల తర్వాత బీజేపీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. తెలంగాణలో ఇకపై ఏ ఎన్నిక వచ్చినా అందులో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. ఇక తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీదే విజయమని బీజేపీ చెబుతోంది. humiliated;view;nagarjuna akkineni;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;apple;nagarjuna sagar dam;warangal;telangana;nalgonda;assembly;letter;european union;custard apple;josh;partyటీఆర్ఎస్‌కు మరోసారి పరాభవం ఎదురవనుందా?టీఆర్ఎస్‌కు మరోసారి పరాభవం ఎదురవనుందా?humiliated;view;nagarjuna akkineni;tiru;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;apple;nagarjuna sagar dam;warangal;telangana;nalgonda;assembly;letter;european union;custard apple;josh;partySat, 09 Jan 2021 15:54:00 GMTహైదరాబాద్: తెలంగాణలో బీజేపీ దూసుకెళ్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాల తర్వాత బీజేపీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. తెలంగాణలో ఇకపై ఏ ఎన్నిక వచ్చినా అందులో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. ఇక తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీదే విజయమని బీజేపీ చెబుతోంది. వరంగల్- ఖమ్మం -నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం సాధించేది తామేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
నిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు బీజేపీనే గెలవాలని కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ గెలుపు కోసం వారంతా కలిసి పని చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. శనివారం వరంగల్‌లో బీజేపీ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 7200 వేల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన అన్నారు. ముందు ఆ బకాయిలు చెల్లించాలని.. ఆ తరువాతే టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడిగేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారిందని, బిక్షం ఎత్తుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, ప్రైవేటు ఉపాధ్యాయుల అండతో తెలంగాణలో మరోసారి బీజేపీ విజయం సాధించబోతోందని ఆయన అన్నారు.

కాగా.. బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు భారీ షాకిచ్చింది. టీఆర్ఎస్‌కు మెజార్టీ దక్కకుండా బీజేపీ అడ్డుకట్ట వేయగలిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది. ఇప్పటికే నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహాలకు బీజేపీ నేతలు పదును పెట్టారు. ఈ ఎన్నికలోనూ విజయం సాధిస్తే తెలంగాణలో ఇక తమకు తిరుగు ఉండదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు.


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?

కిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>