PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/word-fires-between-bjp-and-trsfc0bb8eb-2643-4a26-be9c-d7e81bf2dfa5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/word-fires-between-bjp-and-trsfc0bb8eb-2643-4a26-be9c-d7e81bf2dfa5-415x250-IndiaHerald.jpgదుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, బీజేపీల మద్య వాడీవేడీ విమర్శల పర్వం నడిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీ, అమిత్‌షా ను కలిశారు. అప్పటి నుంచి తెలంగాణలో రాజకీయంగా విపక్ష పార్టీలు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యంగపరంగానే ప్రధానమంత్రి మోడీని కలిశారనీ.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. అయితే బీజేపీ నేతలు మాత్రం.. కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు కొనసాగించారు. ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు ఉన్న టీఆర్ఎస్ word fires between bjp and trs;modi;kcr;tiru;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;prime minister;chief minister;fire;mantraబీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల మంటలు..!బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల మంటలు..!word fires between bjp and trs;modi;kcr;tiru;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;warangal;telangana;prime minister;chief minister;fire;mantraSat, 09 Jan 2021 22:26:21 GMTబీజేపీ విమర్శలను చూసిచూడనట్టు వ్యవహరించిన టిఆర్ఎస్.. ఇక ఏ మాత్రం ఉపేక్షించొద్దని భావిస్తోంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ టార్గెట్ గా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, బీజేపీల మద్య వాడీవేడీ విమర్శల పర్వం నడిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోడీ, అమిత్‌షా ను కలిశారు. అప్పటి నుంచి తెలంగాణలో రాజకీయంగా విపక్ష పార్టీలు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్యంగపరంగానే ప్రధానమంత్రి మోడీని కలిశారనీ.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. అయితే బీజేపీ నేతలు మాత్రం.. కేసీఆర్, టీఆర్ఎస్ టార్గెట్‌గా విమర్శలు కొనసాగించారు. ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు ఉన్న టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు తమ నోటికి పని చెప్పారు.

వరంగల్ పర్యటనలో బీజేపీ చీప్ బండి సంజయ్ సీయం కేసిఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. దీంతో ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే రాజకీయంగా ఇబ్బంది అని భావించింది టీఆర్ఎస్. కమలనాథులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు గట్టిగా బదులివ్వకపోతే ... శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని టీఆర్ఎస్ నేతలు భావించారు. బీజేపీకి కౌంటర్ ఇవ్వడం ద్వారా కట్టడి చేయాలని రంగంలోకి దిగారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బండి సంజయ్ పై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు బండి సంజయ్ పిచ్చికుక్కలాగా అరుచుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు .

బీజేపీ నుంచి వస్తోన్న విమర్శలను కట్టడి చేసేందుకు టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు రంగంలోకి దిగారు. ఇకపై బీజేపీ నుంచి వచ్చే విమర్శలకు అంతేస్థాయిలో గట్టిగా బదులు ఇవ్వాలన్న అలోచనతో ఉన్నారు గులాబీ నేతలు.

మొత్తానికి టీఆర్ఎస్ నేతలు బీజేపీపై ఎదురు దాడికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చాక బీజేపీ నేతలు మరింత దూకుడు పెంచారు.






హరీష్ శంకర్ కథ.. సునీల్ వేదాంతం.. మరో ప్రయత్నం..!

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>