PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishnaa8d583d5-7ba3-4536-bc3c-3e7bb5148f6d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/balakrishnaa8d583d5-7ba3-4536-bc3c-3e7bb5148f6d-415x250-IndiaHerald.jpgఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూ, మరోవైపు బసవ తారకం క్యాన్సర్ హాస్పటల్ బాధ్యతలు చూసుకుంటున్న బాలయ్య, తాజాగా ఎమ్మెల్యేను అనే సంగతి గుర్తుపెట్టుకుని హిందూపురంలో పర్యటిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య, పెద్దగా హిందూపురం వచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ఏ పనులైన పి‌ఏల ద్వారానే నడిపించేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు హిందూపురంలో సొంత డబ్బులు పెట్టి పనులు కూడా చేయిస్తున్నారు. balakrishna;nani;balakrishna;kodali nani;suma;suma kanakala;jagan;government;parliment;hindupuram;minister;cancer;ycp;hindus;partyబాలయ్యకు జగన్ ఛాన్స్ ఇస్తారా? వైసీపీ లెక్కలో పెట్టుకోవడం లేదా?బాలయ్యకు జగన్ ఛాన్స్ ఇస్తారా? వైసీపీ లెక్కలో పెట్టుకోవడం లేదా?balakrishna;nani;balakrishna;kodali nani;suma;suma kanakala;jagan;government;parliment;hindupuram;minister;cancer;ycp;hindus;partySat, 09 Jan 2021 00:00:00 GMTక్యాన్సర్ హాస్పటల్ బాధ్యతలు చూసుకుంటున్న బాలయ్య, తాజాగా ఎమ్మెల్యేను అనే సంగతి గుర్తుపెట్టుకుని హిందూపురంలో పర్యటిస్తున్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య, పెద్దగా హిందూపురం వచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ఏ పనులైన పి‌ఏల ద్వారానే నడిపించేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు హిందూపురంలో సొంత డబ్బులు పెట్టి పనులు కూడా చేయిస్తున్నారు.

ఇక తాజాగా బాలయ్య హిందూపురం పర్యటనకు వచ్చారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుంటూనే, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే మంత్రి కొడాలి నాని టార్గెట్‌గా వార్నింగ్ ఇచ్చిన బాలయ్య, ఆలయాలు దాడులపై కూడా ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. అలాగే ప్రభుత్వంపై పలు రకాల ఆరోపణలు సైతం చేస్తున్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని, ఇన్‌పుట్ సబ్సీడీ ఇవ్వలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

అలాగే తాజాగా హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా ప్రకటించే విషయంలో స్పందించారు. హిందుపురాన్ని జిల్లాగా ప్రకటించాలని, అవసరమైతే ఈ విషయంపై సీఎం జగన్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని, ఇళ్ల పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. అంటే బాలయ్య హిందూపురం స్థానాన్ని జిల్లాగా ప్రకటించాలని మొదట నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నారు. జిల్లాల విభజన అంశం తెరపైకి వచ్చిన దగ్గర నుంచి హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా చేయాలని అంటున్నారు.

మరి ఈ విషయంలో జగన్ ప్రభుత్వం సుముఖంగా లేకపోతే బాలయ్య రంగంలోకి దిగుతారా? జగన్‌ని కలవడానికి ప్రయత్నిస్తారా అనే అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బాలయ్య కలుస్తాను అంటే, జగన్ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అయితే బాలయ్య ఎన్ని విమర్శలు చేసిన వైసీపీ పెద్దగా లెక్కలో తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే బాలయ్య ఏదో తెలిసి తెలియక మాట్లాడతారని అంతా అనుకుంటారు. అందుకే వైసీపీ కూడా బాలయ్యని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.




ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>