PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh-fire-on-cm-jagande43fb51-af86-4924-b1a3-e15788853d0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh-fire-on-cm-jagande43fb51-af86-4924-b1a3-e15788853d0b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఆలయాల చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆలయాలపై దాడులకు సంబంధించి పూజారులు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండకు చెందిన జర్నలిస్టుపై కేసు నమోదైంది.chandrababu naidu;lokesh;telangana rashtra samithi trs;nara lokesh;andhra pradesh;district;police;lakshmi devi;tdp;prakasam district;ycp;lokesh kanagaraj;prakasm;kondapi;lakshmi narasimha;narasimhaపూజారులు, జర్నలిస్టులపై కేసులా!పూజారులు, జర్నలిస్టులపై కేసులా!chandrababu naidu;lokesh;telangana rashtra samithi trs;nara lokesh;andhra pradesh;district;police;lakshmi devi;tdp;prakasam district;ycp;lokesh kanagaraj;prakasm;kondapi;lakshmi narasimha;narasimhaSat, 09 Jan 2021 18:52:13 GMTఆంధ్రప్రదేశ్ లో ఆలయాల చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆలయాలపై దాడులకు సంబంధించి పూజారులు, జర్నలిస్టులపై కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండకు చెందిన జర్నలిస్టుపై కేసు నమోదైంది. అయితే
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారంపై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకే అతనిపై పోలీసులు కేసు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

                     ఆలయ పూజారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం సరికాదని చంద్రబాబు అన్నారు. 140 ఆలయాలపై దాడులు జరుగుతున్నా దోషులను పట్టుకోలేదన్నారు. టీడీపీ కార్యకర్తలుగా ముద్రవేసి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలే కావాలని ఇదంతా చేయిస్తున్నారని తాము కూడా అనాలా? అని ప్రశ్నించారు. అమాయకులను కేసుల్లో ఇరికించ వద్దన్నారు. ఆలయాల ఎదురుగా దుకాణం నడిపేవారిని స్టేషన్‌కు తీసుకెళ్లారా?..అమాయకులను స్టేషన్‌లో పెట్టి వేధిస్తారా? అని ప్రశ్నించారు.

          నిందితులను గాలికొదిలేసి సమాచారం ఇచ్చిన వ్యక్తులను, వార్త రాసిన జర్నలిస్టులను వేధించడమే రాజారెడ్డి రాజ్యాంగం ప్రత్యేకత అని నారా లోకేష్ విమర్శించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ముఖ ద్వారంపై ఉన్న దేవతా మూర్తుల విగ్రహాలు ధ్వంసమైన వార్త రాసినందుకు జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టి వేధించడం వైఎస్ జ‌గ‌న్  మూర్ఖత్వానికి పరాకాష్ట అని లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో 140 ఘటనలు జరిగితే నిందితులను పట్టుకోలేని ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి సమాచారం బయటపెట్టిన వ్యక్తులు, జర్నలిస్టుల పై అక్రమ బనాయిస్తుందని ధ్వజమెత్తారు.వైసీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి అమాయకులపై కేసులు పెడుతున్న కొంతమంది పోలీసులు పర్యవసానం అనుభవించక తప్పదని లోకేష్ హెచ్చరించారు.  ముందే విగ్రహాలు విరిగిపోయాయని మాయచేస్తున్న ప్రభుత్వం మరమ్మత్తులు ఎందుకు చెయ్యలేదు... వాస్తవాలు బయటకొచ్చాకా ఎదో తప్పుడు కథలు చెప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది  అని నారా లోకేష్ విమ‌ర్శించారు.


తెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>