Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/racisme46b644b-60d7-41e9-a44c-24274afdf354-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/racisme46b644b-60d7-41e9-a44c-24274afdf354-415x250-IndiaHerald.jpgటీమిండియా బౌలర్లు జస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు చేదు అనుభవం ఎదురైంది. ఆసీస్‌తో జరుగుతున్న 3వ టెస్టులో వీరిద్దరిపై ప్రేక్షకులు నోటికి హద్దు లేకుండా పోయింది. నోటికొచ్చినట్లు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అది కూడా వరుసగా రెండు రోజుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలకు ..racism;manu;rani;yajamanya;cricket;jasprit bumrah;india;korcha;australia;wales;naga aswin;bcci;paruguసిడ్నీ టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు.. బూమ్రా, సిరాజ్‌లపై..సిడ్నీ టెస్టులో జాత్యహంకార వ్యాఖ్యలు.. బూమ్రా, సిరాజ్‌లపై..racism;manu;rani;yajamanya;cricket;jasprit bumrah;india;korcha;australia;wales;naga aswin;bcci;paruguSat, 09 Jan 2021 21:10:18 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా బౌలర్లు జస్ప్రిత్ బూమ్రా, మహమ్మద్ సిరాజ్‌లకు చేదు అనుభవం ఎదురైంది. ఆసీస్‌తో జరుగుతున్న 3వ టెస్టులో వీరిద్దరిపై ప్రేక్షకులు నోటికి హద్దు లేకుండా పోయింది. నోటికొచ్చినట్లు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. అది కూడా వరుసగా రెండు రోజుల నుంచి ఇలాంటి వ్యాఖ్యలకు వారు బలవుతున్నారు. వీరిద్దరూ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టేడియంలో కూర్చున్న కొందరు ప్రేక్షకులు అభ్యతరకర పదజాలంతో వీరిని దూషించారు. మ్యాచ్ రెండో రోజే ఇలాంటి అనుభవం వారికి ఎదురైంది. అయితే మూడో రోజు కూడా ఇదే తరహా అనుభవం ఎదురవడంతో వీరు కెప్టెన్‌ ఆజింక్య రహానేకు విషయం చెప్పారు. దీంతో రహనేతో పాటు సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా అంపైర్లు పాల్ రీఫెల్, పాల్ విల్సన్‌లకు ఫిర్యాదు చేశారు.

ఈ వర్ణ వివక్ష వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందిగా భారత జట్టు యాజమాన్యం ఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లింది. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియాలు స్పందించాల్సిన అవసరం ఉందని  బీసీసీఐ డిమాండ్ చేసింది. ఇలాంటి ఘటనల్లో కఠిన చర్యలు తీసుకోవాలని ఐసీసీకి సూచించింది. విషయం తెలిసి ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్‌లో ఇలాంటి వాటికి తావుండరాదని హెచ్చరించింది. ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యలు క్రికెట్‌ భవిష్యత్తుకే ప్రమాదకరమని, మానవాళి మనుగడనూ ప్రశ్నార్థకంగా మారుస్తాయని వ్యాఖ్యానించింది.  ఘటనపై దర్యాప్తునకు సిద్ధమైంది. సిడ్నీ క్రికెట్ మైదానం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న 'వెన్యూస్ న్యూసౌత్ వేల్స్'తో  కలిసి సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించేందుకు ఉపక్రమించింది. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో డే అండ్ నైట్ టెస్టుగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ గెలిచింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇక రెండో టెస్టులో భారత్ విజయం కైవసం చేసుకుని 1-1తో సిరీస్ సమయం చేసింది. ఇప్పుడు సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులకు ఆలౌటౌైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 224 పరుగులుకే ఆలౌటైంది. పుజారా, గిల్ అర్థ సెంచరీలతో రాణించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 103 పరుగులు చేసి కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. దీంతో 197 పరుగుల ఆధిక్యంలో ఆసీస్ నిలిచింది.


బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?

పూజారులు, జర్నలిస్టులపై కేసులా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>