PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/election-code-effect-on-amma-vodi-programme3966dfed-85c9-4f34-a624-d467a96c37d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/election-code-effect-on-amma-vodi-programme3966dfed-85c9-4f34-a624-d467a96c37d6-415x250-IndiaHerald.jpgఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా అమ్మఒడి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. తొలుత 9వతేదీ అనుకున్నా, వివిధ కారణాలతో అది 11కి వాయిదా పడింది. 11వతేదీన నెల్లూరులో సీఎం జగన్ అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు, ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ అవుతుంది. అయితే శుక్రవారం రాష్ట్రంలో జరిగిన అనూహ్య పరిణామాలు అమ్మఒడికి అడ్డంకిగా మారుతాయని తెలుస్తోంది. amma vodi;amala akkineni;kumaar;jagan;nellore;panchayati;court;local language;ammavodiఅమ్మఒడి ఆగిపోతుందా..? ఎన్నికలకోడ్ అడ్డం వస్తుందా..?అమ్మఒడి ఆగిపోతుందా..? ఎన్నికలకోడ్ అడ్డం వస్తుందా..?amma vodi;amala akkineni;kumaar;jagan;nellore;panchayati;court;local language;ammavodiSat, 09 Jan 2021 08:00:00 GMTఅమ్మఒడి లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. తొలుత 9వతేదీ అనుకున్నా, వివిధ కారణాలతో అది 11కి వాయిదా పడింది. 11వతేదీన నెల్లూరులో సీఎం జగన్ అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు, ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ అవుతుంది. అయితే శుక్రవారం రాష్ట్రంలో జరిగిన అనూహ్య పరిణామాలు అమ్మఒడికి అడ్డంకిగా మారుతాయని తెలుస్తోంది.

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. శనివారం నుంచి ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. అయితే పంచాయతీ ఎన్నికలు కాబట్టి.. కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ నిబంధనలు అమలులో ఉంటాయని చెప్పారు. అయితే అమ్మఒడి అనేది రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు నగదు చెల్లించే కార్యక్రమం దానికి పట్టణ, గ్రామీణ అనే తేడా లేదు. అంటే అమ్మఒడికి కూడా ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందా, లేక ముందే ప్రకటించినట్టు ఆ కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించుకోవచ్చా అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

రెండో ఏడాది కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రారంభిస్తే, ఆ ప్రభావం స్థానిక ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చేసారు. అమ్మఒడి ఇస్తే ఆ ప్రభావం కచ్చితంగా ఎన్నికల మీద ఉంటుంది. కానీ ఇప్పుడీ హడావుడి షెడ్యూలు కారణంగా అమ్మఒడి వాయిదా పడినట్లేనని అంటున్నారు. మరోవైపు ఇళ్ల పట్టాల పంపిణీకూడా కొన్నిచోట్ల వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎన్నికల షెడ్యూల్ పై స్పందించలేదు. ఒకవేళ కోర్టులకు వెళ్లి ఈ ప్రక్రియ ఆపేందుకు ప్రయత్నం మొదలు పెడితే పరిణామాలు మారిపోతాయి. కోర్టులో కేసు వేసి అమ్మఒడి నిధుల విడుదలకోసం అత్యవసర అనుమతి తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. ఏది ఏమయినా.. అమ్మఒడికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులను ఎన్నికల కోడ్  ఆందోళనకు గురిచేస్తుందనే విషయం మాత్రం స్పష్టమైంది. 


ధరణి పోర్టల్.. తప్పక తప్పు చేయాల్సి వస్తుంది..?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>