PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/bhuma-akhila-priya-leading-in-kurnool-tdp09136c0c-39b4-47b6-ad12-2d8be01b74b7-415x250-IndiaHerald.jpgజైలుకు త‌ర‌లించ‌డం కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రిం చుకుంది. ఇక‌, ఈ మొత్తం ఎడిసోడ్ వెనుక రాజ‌కీయ కుట్ర ఉంద‌నేది భూమా అఖిల ప్రియ సోద‌రి, సోద‌రుడి ఆరోప‌ణ‌. స‌రే! ఇదంతా ఇలా ఉంటే.. అత్యంత సంక్లిష్ట‌మైన ఈ స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు.. అతి పిన్న‌వ‌య‌స్కురాలైన భూమా అఖిల ప్రియ అరెస్ట‌యిన‌ప్పుడు.. ఆమెకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన టీడీపీ ఫుల్ సైలెంట్ అయిపోయింది. ఇదే ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ఓట‌మి పాలైన త‌ర్వాత‌.. క‌ర్నూలులో ఎంతో మంది సీనియ‌ర్లు ఉండి akhila priya;nithya new;ranina;district;police;bhuma akhila priya;minister;letter;tdp;butter;partyటీడీపీలో అఖిల‌ప్రియ టార్గెట్‌గా కొత్త రాజ‌కీయం... అంద‌రూ గ‌ప్‌చుప్ వెన‌క‌..?టీడీపీలో అఖిల‌ప్రియ టార్గెట్‌గా కొత్త రాజ‌కీయం... అంద‌రూ గ‌ప్‌చుప్ వెన‌క‌..?akhila priya;nithya new;ranina;district;police;bhuma akhila priya;minister;letter;tdp;butter;partySat, 09 Jan 2021 11:45:03 GMTక‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది. ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా ఇటీవ‌ల కాలంలో టీడీపీకి వెన్నుద‌న్ను గా ఉన్న మాజీ మంత్రి, మ‌హిళా నాయ‌కురాలు, భూమా అఖిలప్రియ అనూహ్యంగా జైలు పాల‌య్యారు. హైద‌రాబాద్‌లోని హ‌ఫీజ్‌పేట భూ లావేదేవీల‌కు సంబంధించిన కేసులో కొంద‌రిని కిడ్నాప్ చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై భూమా అఖిల ప్రియ‌ను అక్క‌డి పోలీసులు అరెస్టు చేయ‌డంతోపాటు.. ఏ1గా పేర్కొంటూ.. జైలు పంపారు. అయితే.. ఇక్క‌డ చాలా నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత ఈ కేసులో ఏ2గా పేర్కొన్న అఖిల ప్రియ‌ను.. అనూహ్యంగా రాత్రికి రాత్రి ఏ1గా పేర్కొన‌డం.. రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించింది.

అదేస‌మయంలో గ‌ర్భ‌వ‌తిగా ఉన్న అఖిల ప్రియ‌ను వెనువెంట‌నే జైలుకు త‌ర‌లించ‌డం కూడా రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రిం చుకుంది. ఇక‌, ఈ మొత్తం ఎడిసోడ్ వెనుక రాజ‌కీయ కుట్ర ఉంద‌నేది భూమా అఖిల ప్రియ సోద‌రి, సోద‌రుడి ఆరోప‌ణ‌. స‌రే! ఇదంతా ఇలా ఉంటే.. అత్యంత సంక్లిష్ట‌మైన ఈ స‌మ‌స్య ఎదురైన‌ప్పుడు.. అతి పిన్న‌వ‌య‌స్కురాలైన భూమా అఖిల ప్రియ అరెస్ట‌యిన‌ప్పుడు.. ఆమెకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన టీడీపీ ఫుల్ సైలెంట్ అయిపోయింది. ఇదే ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో చ‌ర్చ‌కు దారితీసింది. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోర ఓట‌మి పాలైన త‌ర్వాత‌.. క‌ర్నూలులో ఎంతో మంది సీనియ‌ర్లు ఉండి కూడా.. ఏ ఒక్క‌రూ పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేందుకు ముందుకు రాలేదు.

ఆ స‌మ‌యంలో ముందుండి పార్టీని న‌డిపించేందుకు రెడీ అయ్యారు అఖిల‌ప్రియ‌. రాష్ట్రంలోని జ‌గ‌న్ స‌ర్కారు నుంచి ఎన్నో కేసులు ఎదురైనా.. కూడా మొక్క‌వోని దీక్ష‌తో ముందుకు సాగారు. నిత్యం నియోజ‌క‌వ‌ర్గంలో క‌లియ‌దిరుగుతూ.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. దానిని టీడీపీకి అనుకూలంగా మార్చుకుంటూ.. ముందుకు క‌దిలారు. అలాంటి నాయ‌కురాలికి.. ఇప్పుడు అనూహ్యంగా క‌ష్టం వ‌చ్చింది.

అయితే.. ఈ స‌మ‌యంలో అండ‌గా నిల‌వాల్సిన పార్టీ.. ముఖం చాటేసింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీనికి కార‌ణాలేంటి? ఎందుకు ఇలా జ‌రిగింది? అనే అంశాల‌పై జిల్లాలోను, పార్టీ సీనియ‌ర్ల‌లోనూ చ‌ర్చ సాగుతోంది. ఉద్దేశ పూర్వ‌కంగానే అఖిల‌ను ప‌క్క‌న పెట్టారా?  లేక ఈ కేసులో మ‌రో నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నందున.. ఎవ‌రి ప‌క్షాన మాట్లాడితే.. ఏం జ‌రుగుతుందోన‌ని చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అనే అంశంపై త‌ర్జ‌న భ‌ర్జన సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. 


జ‌గ‌న్ అనుకున్న‌ది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి.. ఊహించ‌లేదా..?

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>