PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-flu-time6b63c57f-9cb1-48e3-a3eb-047a49d2a0ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bird-flu-time6b63c57f-9cb1-48e3-a3eb-047a49d2a0ae-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు టీకా వచ్చేస్తుందని ప్రజలు సంతోషపడుతున్న తరుణంలో.. మరో వ్యాధి తలెత్తింది. అదే బర్డ్ ఫ్లూ. ప్రస్తుతం మన దేశంలో ప్రజలను కరోనాతో సరి సమానంగా వణికిస్తున్న ఈ వ్యాధి కారణంగా కోళ్ల వంటి పక్షులను విపరీతంగా చంపేస్తున్న విషయం తెలిసిందే. చికెన్, గుడ్లు తినడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. chicken;manish;manu;kerala;delhi;gujarat - gandhinagar;haryana - chandigarh;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;chicken;manish pandeyచికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?chicken;manish;manu;kerala;delhi;gujarat - gandhinagar;haryana - chandigarh;himachal pradesh;madhya pradesh - bhopal;rajasthan;chicken;manish pandeySat, 09 Jan 2021 22:16:03 GMTన్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు టీకా వచ్చేస్తుందని ప్రజలు సంతోషపడుతున్న తరుణంలో.. మరో వ్యాధి తలెత్తింది. అదే బర్డ్ ఫ్లూ. ప్రస్తుతం మన దేశంలో ప్రజలను కరోనాతో సరి సమానంగా వణికిస్తున్న ఈ వ్యాధి కారణంగా కోళ్ల వంటి పక్షులను విపరీతంగా చంపేస్తున్న విషయం తెలిసిందే. చికెన్, గుడ్లు తినడానికి కూడా ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే బర్డ్ ఫ్లూ భయం కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో చికెన్, గుడ్లు అమ్మకాలు 50 శాతంపైగా తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు తెలియ జేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేలాది పక్షులు చనిపోయాయి, అలాగే చాలా పక్షులను ఫామ్స్‌లోనే యజమానులు చంపేశారు కూడా. బర్డ్ ఫ్లూ ప్రబలిందనే భయంతో గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కేరళ తదితర రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల అమ్మకాలు 50 శాతంపైగా పడిపోయినట్లు సమాచారం. పక్షుల్లో సోకే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ఏ హెచ్5 ఎన్ 1 వైరస్.. మనుషులకు కూడా సోకుతోందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. పక్షుల ఫ్లూ వ్యాప్తిని నియంత్రించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొన్ని రాష్ట్రాల్లో గుడ్లు, చికెన్‌ల అమ్మకాలు విపరీతంగా తగ్గిపోయాయి.

దేశంలోని అతిపెద్ద హోల్ సేల్ చికెన్ మార్కెట్లలో ఒకటైన ఖాజీపూర్ ముర్గీమండీ బర్డ్ ఫ్లూ భయం కారణంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. బర్డ్ ఫ్లూ పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ధరలు గణనీయంగా తగ్గాయి. కోళ్లను ట్రక్కుల్లో రవాణా చేస్తున్న సమయంలోనే వాటిలో 2 శాతం కోళ్లు మరణించాయి. యూపీలోనూ చికెన్ అమ్మకాలు 30 శాతం తగ్గాయి. బర్డ్ ఫ్లూ ప్రబలుతుందనే అనుమానంతో పశుసంవర్థక శాఖ అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?

పూజారులు, జర్నలిస్టులపై కేసులా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>