PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgసామాజిక స‌మీక‌ర‌ణ‌లు క‌లిసొచ్చి మంత్రి అయ్యారు. విప‌క్షాల‌పై విరుచుకు ప‌డ‌డ‌మే కాదు.. ఇటు స్వ‌ప‌క్షంలో సీనియ‌ర్ల‌కు సైతం చెక్ పెట్టేస్తున్నాడ‌ని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సైతం అప్ప‌ల‌రాజుపైనే బాణాలు ఎక్కుపెట్టి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మంత్రిది అప్ప‌ల‌రాజు రాజ్యం అని... ఆయ‌న ఇలాకాలో అవినీతి, భూక‌బ్జాలు పెరిగి పోతున్నాయ‌ని అచ్చెన్న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇక ఇటు శ్రీకాకుళం వైసీపీలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ysrcp;tiru;andhra pradesh;deputy chief minister;cm;mla;minister;cheque;letter;tdp;ycp;dookudu;partyవైసీపీలో ఆ జూనియ‌ర్ మంత్రి రాజ్య‌మేలుతున్నారా... ఇప్పుడిదే హాట్ టాపిక్‌..?వైసీపీలో ఆ జూనియ‌ర్ మంత్రి రాజ్య‌మేలుతున్నారా... ఇప్పుడిదే హాట్ టాపిక్‌..?ysrcp;tiru;andhra pradesh;deputy chief minister;cm;mla;minister;cheque;letter;tdp;ycp;dookudu;partySat, 09 Jan 2021 15:31:00 GMTరాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రెండేళ్ల‌కే అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఆయ‌న గెలుపు స‌రికొత్త చ‌రిత్ర క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఆయ‌న రాజ్య‌మే న‌డుస్తోంద‌ట‌. అటు ప్ర‌తిప‌క్షం నేత‌ల‌తో పాటు ఇటు అధికార ప‌క్షం నేత‌లు కూడా ఆ మంత్రి దూకుడు చూసి కుళ్లుకుంటోన్న ప‌రిస్థితి. ఇంత‌కు ఆ మంత్రి ఎవ‌రో కాదు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదిరి అప్ప‌ల‌రాజు. సాధార‌ణ డాక్ట‌ర్ నుంచి మూడేళ్ల‌లోనే మంత్రి స్థాయికి ఎదిగిపోయారు అప్ప‌ల‌రాజు.

ఆరు నెల‌ల క్రింద‌టే ఆయ‌న ల‌క్ బాగుండి.. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు క‌లిసొచ్చి మంత్రి అయ్యారు. విప‌క్షాల‌పై విరుచుకు ప‌డ‌డ‌మే కాదు.. ఇటు స్వ‌ప‌క్షంలో సీనియ‌ర్ల‌కు సైతం చెక్ పెట్టేస్తున్నాడ‌ని వైసీపీ వాళ్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఇక అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి, ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు సైతం అప్ప‌ల‌రాజుపైనే బాణాలు ఎక్కుపెట్టి విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మంత్రిది అప్ప‌ల‌రాజు రాజ్యం అని... ఆయ‌న ఇలాకాలో అవినీతి, భూక‌బ్జాలు పెరిగి పోతున్నాయ‌ని అచ్చెన్న విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇక ఇటు శ్రీకాకుళం వైసీపీలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వాయిస్ ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌ను సైతం అప్ప‌ల‌రాజు డామినేట్ చేసేస్తున్నార‌ట‌. ఇక స్పీక‌ర్ త‌మ్మినేని ఉన్నా ఆయ‌న కూడా అప్ప‌ల‌రాజు దూకుడు ముందు రేసులో వెన‌క ప‌డి పోతున్నార‌ని గుస‌గుస‌లు వ‌స్తున్నాయి. అదే క్ర‌మంలో అటు విప‌క్ష పార్టీ నేత‌ల‌కు డైరెక్టుగా అప్ప‌ల‌రాజు టార్గెట్ అవుతుంటే.. స్వ‌ప‌క్షంలో చాలా మంది నేత‌లు ఆయ‌న దూకుడుకు తెర‌వెన‌క చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌.

నిన్న కాక మొన్న వ‌చ్చి మంత్రి అవ్వ‌డంతో పాటు త‌మ రాజ‌కీయానికి.. త‌మ ప్రాభావానికి గండి కొడుతున్నార‌ని లోలోప‌ల రుస‌రుస‌లాడి పోతున్నార‌ట‌. మ‌రి ఈ అప్ప‌ల‌రాజు రాజ్యం ఎంత కాలం ఏల‌తారో ?  ఇది ఎలా మ‌లుపు తిరుగుతుందో ?  చూడాలి. 


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?

కిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>