MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/renu-desai-got-carona1aa5f264-ac1e-4994-91a2-d32ed4d4d992-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/renu-desai-got-carona1aa5f264-ac1e-4994-91a2-d32ed4d4d992-415x250-IndiaHerald.jpgస్పందించిన రేణు అసలు విషయం చెప్పుకొచ్చారు. తనకు కరోనా సోకింది అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కుండ బద్దలు కొట్టారు. నాకు నిజంగానే కరోనా వచ్చిందని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. ఒకవేళ కరోనా వచ్చి ఉంటే.... బాధ్యతగల ఓ వ్యక్తి గా ఇలా నలుగురిలో తిరగను. renu desai got carona;pawan;renu desai;tiger;wife;nijam;vరేణు దేశాయ్ కు కరోనా...ఆమె మాటల్లోనే విందాం...!రేణు దేశాయ్ కు కరోనా...ఆమె మాటల్లోనే విందాం...!renu desai got carona;pawan;renu desai;tiger;wife;nijam;vSat, 09 Jan 2021 13:00:00 GMTపులి అంటే ఇదిగో తోక" అనే ప్రచారాలు సోషల్ మీడియాలో చాలానే జరుగుతుంటాయి. ఇక్కడ వాస్తవ వార్తలకు ఎంత ఆస్కారం ఉంటుందో  అదే విధంగా గాసిప్స్ కు కూడా అంతే చోటు ఉంటుంది. సెలబ్రిటీలకు అయితే ఇలాంటి కల్పిత కథలు తరచూ జరుగుతూనే ఉంటాయి... కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కొన్నిసార్లు  అసహనానికి గురి అయినప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఇటువంటి కథనాలపై  ఫైర్ అవుతుంటారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో ఏ న్యూస్ అయినా చాలా ఫాస్ట్ గా ప్రజల్లోకి వెళుతుంది. ఇది ఎంత ప్లస్సో అంతే మైనస్ కూడా. వాస్తవం అయినప్పుడు ఓకే గాని... అసత్య ప్రచారం అయినప్పుడే కొన్నిసార్లు సమస్యగా మారుతుంది.

ఇప్పుడు ఇదే తరహాలో ఫేక్ న్యూస్... పపన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ని  తెగ ఇబ్బంది పెట్టింది. ఆమెకు కరోనా వచ్చిందంటూ ఓ అసత్య ప్రచారం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆందోళన చెంది ఆమెకు త్వరగా నయం కావాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెట్టారు. అది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు రేణుదేశాయ్ వరకు వెళ్ళింది... ఇందుకు స్పందించిన రేణు అసలు విషయం చెప్పుకొచ్చారు. తనకు కరోనా సోకింది అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కుండ బద్దలు కొట్టారు. నాకు నిజంగానే కరోనా వచ్చిందని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి.  కానీ అలాంటిదేమీ లేదు. ఒకవేళ కరోనా వచ్చి ఉంటే.... బాధ్యతగల ఓ వ్యక్తి గా ఇలా నలుగురిలో తిరగను. ఖచ్చితంగా ఇంట్లో ఉండేదాన్ని. నాకు నా ప్రాణం ఎంత ముఖ్యమో ప్రజల క్షేమం కూడా అంతే ముఖ్యం. నాకు కరోనా నిర్ధారణ అయింది అన్న వార్త ముమ్మాటికి అసత్యం అంటూ క్లారిటి ఇచ్చింది.

అంతేకాదు.... ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యాక, ఆమె ఎదుర్కొన్న ఓ వింత సంఘటన ను షేర్ చేసింది. నిన్న ఓ ఫంక్షన్ కు వెళ్తే అందరూ నన్ను అదోలా చూశారు. నావల్ల ఎక్కడ ఇతరులకి కరోనా సోకుతుందేమో అన్నట్టుగా చూసిన వారి చూపులు నాకు ఎంతో బాధను కలిగించాయి. అందుకే ఈ పోస్టు పెడుతున్నా... నాకు కరోనా వస్తే ఆ విషయాన్ని స్వయంగా నేనే వెల్లడిస్తాను అంతేకాదు.. బాధ్యత గల వ్యక్తిగా ఎవరిననీ కలవను.... కార్యక్రమాలకైతే అసలే హాజరు కాను అంటూ ఈ తప్పుడు వార్తలను సృష్టించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది రేణు. కొందరు కేవలం సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాస్తూ బతుకుతారని .... ఇటువంటి అసత్య ప్రచారాలలో ఎంత నిజముందో తెలుసుకోకుండా వాటి గురించి కథలు కథలుగా రాయడం సరికాదంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది  రేణు దేశాయ్.


వైసీపీపై లోకేశ్ దూకుడు

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>