PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covin-appd37e4d8a-62d9-43d4-8e99-666a6ca62d23-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covin-appd37e4d8a-62d9-43d4-8e99-666a6ca62d23-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా డ్రైరన్ పేరుతో నిర్వహించిన కొవిడ్ టీకా పంపిణీ ట్రయల్ వెర్షన్లో పలు ఆసక్తికర విషయాలు బైటపడ్డాయి. అధికారులు, సిబ్బంది సన్నద్ధత బాగానే ఉన్నా.. సాఫ్ట్ వేర్ లో సమస్యలు ఉన్నట్టు స్పష్టమయింది. సిబ్బంది అవగాహనతోపాటు, కొవిన్ అనే సాఫ్ట్ వేర్ పనితీరు తెలుసుకోడానికే ముఖ్యంగా ఈ డ్రైరన్ నిర్వహించారు. అయితే ఆ సాఫ్ట్ వేర్ లో పలు సమస్యలు ఉన్నట్టు ఇప్పుడు బైటపడింది. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధపడింది. covin app;district;software;central governmentటీకా సాఫ్ట్ వేర్ ఫెయిల్యూర్.. ఆందోళనలో అధికారులు..టీకా సాఫ్ట్ వేర్ ఫెయిల్యూర్.. ఆందోళనలో అధికారులు..covin app;district;software;central governmentSat, 09 Jan 2021 07:00:00 GMTసాఫ్ట్ వేర్ లో సమస్యలు ఉన్నట్టు స్పష్టమయింది. సిబ్బంది అవగాహనతోపాటు, కొవిన్ అనే సాఫ్ట్ వేర్ పనితీరు తెలుసుకోడానికే ముఖ్యంగా ఈ డ్రైరన్ నిర్వహించారు. అయితే ఆ సాఫ్ట్ వేర్ లో పలు సమస్యలు ఉన్నట్టు ఇప్పుడు బైటపడింది. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు సిద్ధపడింది.

కొవిడ్‌ టీకా పంపిణీలో భాగంగా తెలంగాణలో నిర్వహించిన డ్రైరన్ లో కొవిన్ సాఫ్ట్ వేర్ అధికారులను ముప్పతిప్పలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1200 కేంద్రాల్లో టీకా పంపిణీకి సంబంధించిన డ్రై రన్ ‌నిర్వహించాలుకున్నా.. సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల కేవలం 917 కేంద్రాల్లో మాత్రమే ఈ ప్రక్రియ మొదలైంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో 21,777 మంది లబ్ధిదారులు డ్రై రన్‌లో పాల్గొన్నారు. ఈ డ్రై రన్‌ లో పిన్‌ కోడ్‌ గుర్తించడంలో సాఫ్ట్‌ వేర్ విఫలమైందని తెలుస్తోంది. ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని అంటున్నారు అధికారులు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య కూడా మరో కారణం. ఇక దేశవ్యాప్తంగా ఒకేసారి డ్రై రన్ నిర్వహించడంతో సర్వర్ పై ప్రభావం పడిందని, దీని వల్ల సాఫ్ట్ వేర్ స్లోగా మారిందని అంటున్నారు.

కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి సమాచారాన్ని పొందుపరిచే సమయంలో వారి పేరు, వయసు, ఫోన్‌ నెంబర్, అడ్రస్ తో పాటు.. పిన్ కోడ్ కూడా తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. పిన్‌ కోడ్‌ చేర్చకపోతే కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి సమాచారం చేరదు. ఒక పిన్ ‌కోడ్‌ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో మూడు నుంచి నాలుగు కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు.. లబ్ధిదారుడికి సమీప కేంద్రంలో కాకుండా మరో కేంద్రంలోకి టీకా పంపిణీ ప్రదేశాన్ని సాఫ్ట్‌ వేర్‌ కేటాయిస్తోంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత.. ఒకే పిన్ ‌కోడ్‌ పరిధిలోని ప్రాంతాలు కూడా వేర్వేరు జిల్లాల పరిధిలోకి మారిపోయాయి. లబ్ధిదారుడు కోరుకున్న టీకా కేంద్రం మారడంతో పాటు కొన్నిసార్లు జిల్లా కూడా మారుతోంది. దీని వల్ల వచ్చిన ఇబ్బందులను అధికారులు సరిదిద్దుతున్నారు. అటు కొవిన్ సాఫ్ట్ వేర్ పనితీరులో వేగం తగ్గినట్టు గుర్తించిన అధికారులు.. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామంటున్నారు. వీటన్నిటిని రెక్టిఫై చేసుకున్న తర్వాతే కొవిడ్ టీకా పంపిణీ మొదలయ్యే అవకాశాలున్నాయి.


ధరణి పోర్టల్.. తప్పక తప్పు చేయాల్సి వస్తుంది..?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>