PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohan-reddy5bd8ed21-2f99-4b71-97be-a214035b5b28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganmohan-reddy5bd8ed21-2f99-4b71-97be-a214035b5b28-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గట్టి షాక్ మీద షాక్ తగులుతుంది. జగన్ అభిష్టానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా జగన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.jaganmohan reddy;jagan;andhra pradesh;ram madhav;mp;court;chief minister;cbi;local language;ycp;research and analysis wing;nampallyజగన్, విజయసాయిరెడ్డికి ఈడీ సమన్లుజగన్, విజయసాయిరెడ్డికి ఈడీ సమన్లుjaganmohan reddy;jagan;andhra pradesh;ram madhav;mp;court;chief minister;cbi;local language;ycp;research and analysis wing;nampallySat, 09 Jan 2021 12:54:51 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గట్టి షాక్ మీద షాక్ తగులుతుంది. జగన్ అభిష్టానికి వ్యతిరేకంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా జగన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
                                           అరబిందో, హెటిరో సంస్థలకు భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఈ సమన్లు జారీ అయ్యాయి. చార్జిషీట్ విచారణను స్వీకరించిన కోర్టు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు.. ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌ను ఆదేశించింది. ఆయనతో పాటుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్‌రెడ్డి, ట్రైడెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్యకి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
                                                    అయితే ఈ సమన్లపై జగన్ తరఫు న్యాయవాదులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాల్సి ఉంది. 11వ తేదీన వైఎస్ జగన్ కోర్టుకు హాజరవుతారా? లేక ఆయన తరఫున న్యాయవాదులు ఏదైనా మినహాయింపు కోరతారా? అనేది తేలాల్సి ఉంది. జగన్‌ ఆస్తుల కేసులపై సీబీఐ ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ.. సీబీఐ కోర్టులో ఆరు ఛార్జిషీట్లు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ కోర్టులో ఒక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అయితే నాంపల్లి కోర్టులో పెండింగ్‌లో ఉన్న చార్జిషీట్‌ను కూడా స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని జగతి పబ్లికేషన్‌లో కోరింది. దీంతో ఈ చార్జిషీట్‌ను ఈడీ కోర్టుకు బదిలీ చేశారు. శుక్రవారం ఆ చార్జిషీట్‌పై విచారణ చేపట్టిన ఈడీ కోర్టు.. వైఎస్ జగన్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.


తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!

గుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>