MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthisureshccb94d8a-f3d3-4933-99d6-5d75c1d6a775-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keerthisureshccb94d8a-f3d3-4933-99d6-5d75c1d6a775-415x250-IndiaHerald.jpgమహానటి చిత్రంతో విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్న నటి కీర్తి సురేష్. నేను శైలజ చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టిన కీర్తి సురేష్ మహా నటి చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతంkeerthisuresh;mahesh;suresh;keerthi suresh;kirti;selva raghavan;simhaa;india;cinema;telugu;rajani kanth;amazon;kollywood;media;tamil;nenu sailaja;mahanati;dogs;maha;chitramకొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..కొత్త సంవత్సరం వచ్చి పది రోజులు కూడా కాకముందే.. కీర్తి సురేష్..keerthisuresh;mahesh;suresh;keerthi suresh;kirti;selva raghavan;simhaa;india;cinema;telugu;rajani kanth;amazon;kollywood;media;tamil;nenu sailaja;mahanati;dogs;maha;chitramSat, 09 Jan 2021 23:02:58 GMTమహానటి చిత్రంతో విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకున్న నటి కీర్తి సురేష్. నేను శైలజ చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టిన కీర్తి సురేష్ మహా నటి చిత్రం తర్వాత స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. మహానటి చిత్రానికి గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డ్ కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం కీర్తి సురేష్ దక్షిణాది సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. తెలుగు, తమిళ, మళయాల చిత్రాల్లో ఆమె వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. గతేడాది స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించిన చిత్రాలు కరోనా నేపథ్యంలో థియేటర్లలోకి రాలేక పోయాయి. కానీ.. కీర్తి సురేష్ మాత్రం ఓటీటీతో దూసుకొచ్చింది. కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా, పెంగ్విన్ చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల అయ్యాయి.

అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన పెంగ్విన్, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మిస్ ఇండియా చిత్రాలు అనుకున్న విధంగా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. అయితే.. థియేటర్లలో విడుదల కాబోయే చిత్రాలపై ఆమె ఆశ పెట్టుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ‘గుడ్‍ లక్‍ సఖి’ ‘రంగ్‍ దే’, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట' చిత్రాల్లో నటిస్తోంది. మరోపక్క మలయాళంలో 'మరక్కార్ అరబికదలింటే సింహం' సినిమాల షూటింగ్స్ పూర్తి చేసింది. ఈ రెండు ఇండస్ట్రీలతో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో సరసన 'అన్నాతే'లోనూ, సెల్వ రాఘవన్ తో 'సాని కాయిదం'లోనూ చేస్తోంది.

ఈ విషయాలను పక్కన పెడితే ఈ ఏడాది వచ్చి పది రోజులు కూడా కాక ముందే తాను ఈ ఏడాదిలో తొలి షూటింగ్‌ను పూర్తి చేశానంటూ సోషల్ మీడియా ఖాతాలో చెప్పుకొచ్చింది. అయితే ఈ షూటింగ్‌ సినిమాకు సంబంధించింది కాదని, ఓ యాడ్‌ కోసం ఆమె షూట్ చేసినట్టు ఆమె పోస్ట్ చేసిన ఫొటో బట్టి అర్థమవుతోంది. ఈ యాడ్‌లో కీర్తి సురేష్ పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది.  


ఏంటి..... ఆర్ఆర్ఆర్ కోసం అనుకున్న డేట్ ని .... కెజిఎఫ్ 2 కి ఫిక్స్ చేసారా .....??

డేట్లు ఫిక్స్ చేసుకున్న అన్నదమ్ములు?.. ఎవరెప్పుడంటే..

ట్రంప్ ట్విట్టర్ డిలీట్.. ఆయన పార్టీ వాళ్లు ఏమంటున్నారో తెలుసా?

కరోనా టీకా తీసుకున్న రాజు, రాణి.. ఎక్కడంటే?

చికెన్, గుడ్లు సేల్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే షాకవ్వాల్సిందే?

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>