PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/land544945ee-a87f-4cb5-b3f4-3643487ff7aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/land544945ee-a87f-4cb5-b3f4-3643487ff7aa-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఎదగడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కష్టపడి పైకి రావడం. ఇది జరగాలంటే ఒక తరమంతా పోరాటం చేస్తేనే రెండవ తరం కోట్లు దాచుకుంటుంది. మరి ఈజీగా సంపాదన ఏంటి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అన్నింటి కంటే అతి సులువైన మార్గం ఒకటి ఉంది. land;vishakapatnam;capital;vegetable market;ycpతవ్వితే వంద కోట్లు... ఎక్కడ.. ఎందుకు...?తవ్వితే వంద కోట్లు... ఎక్కడ.. ఎందుకు...?land;vishakapatnam;capital;vegetable market;ycpSat, 09 Jan 2021 20:00:00 GMT
అదే కర్చీఫ్ వేసేసి మరీ ఎకరాలకు ఎకరాల‌ భూములు కొట్టేయడం. సర్కార్ వారి భూములు అయితే చాలా దర్జాగా కొట్టేయవచ్చు. ఎందుకంటే అవి జాతీయం చేయడం చాలా సులభం. ప్రభుత్వం అంటే ఎవరిది, ప్రజలది, ఆ ప్రజలలో కొందరు తమదే ఆ భూమి అనుకుంటే సరిపోదా. హ్యాపీగా ఎకరాలకు ఎకరాలు సొంతం అవుతాయి.

బాగా ఎదిగిన సిటీలలో భూ దందాలు యమ జోరుగా సాగిపోతూంటాయి. అవి చాలా కామన్ అని కూడా అంటారు. విశాఖ ఉమ్మడి ఏపీలో ఉన్నపుడే మెగా సిటీగా ఉంది. భిజన తరువాత దాని ప్రాధాన్యత బాగా పెరిగిపోయింది. ఇపుడు వైసీపీ సర్కార్ వచ్చకా రాజధాని నగరంగా ప్రకటించింది. దాంతో ఎక్కడ లేని ప్రాధాన్యత విశాఖకు వచ్చేసింది.

అందుకే గజానికో కబ్జా జరుగుతోంది. విశాఖలో భూ కబ్జాల మీద వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక సిట్ ని పెట్టి విచారణ జరిపించింది. ఆ నివేదికలో అసక్తికరమైన విషయాలు బయటకు వచ్చారు. ప్రభుత్వం, ప్రైవేటు అన్న తేడా లేకుండా దాదాపుగా నాలుగు వందల ఎకరాలు కబ్జా చేశారని తేలింది.

దాంతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు విశాఖలో కబ్జా అవుతున్నాయి. వీకెండ్  స్పెషల్ డ్రైవ్ చేస్తూ రెవిన్యూ అధికారులు వీటిని  స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు. ఇపుడు విశాఖ నగర శివారలో కొమ్మాది దగ్గర దాదాపుగా ముప్పయి ఒకక్ ఎకరాల అతి ఖరీదైన భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ రేటు ప్రకారం చూస్తే వందల కోట్ల మేర దీని విలువ ఉంటుందని అంటున్నారు. చిత్రమేంటంటే రెవిన్యూ రికార్డుల్లో ఇది ప్రభుత్వ భూమి అని ఉంటే ప్రైవేట్ ఆసామి ఒకరు బేఫికర్ గా  ఆక్రమించడమే కాకుండా తన సొంత వారిని కాపలాగా కూడా పెట్టి భలే తమషాగా  కధ నడుపుతున్నాడు. గునపం పెట్టి తవ్వితే ఇలాంటి వందల కోట్ల అక్రమాలు అడుగడుగునా విశాఖలో కనిపిస్తాయని అంటున్నారు.




తెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>