MLAProgressM N Amaleswara raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp745ca87f-0bef-42eb-80b8-ca946f687b49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp745ca87f-0bef-42eb-80b8-ca946f687b49-415x250-IndiaHerald.jpgవిశాఖపట్నంలో టీడీపీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో నర్సీపట్నం కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. అది కూడా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మంచి మంచి విజయాలు అందుకున్నారు. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2014 వరకు ఇక్కడ అయ్యన్నకు తిరుగులేదనే చెప్పాలి. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన అయ్యన్న...1989, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు. ysrcp;ntr;amala akkineni;shankar;tiru;jagan;2019;vishakapatnam;bus;capital;mandalam;mla;aqua;tdp;ycp;nandamuri taraka rama rao;ayyannapatrudu;dookuduహెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడు దూకుడు తగ్గలేదా?హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పూరీ తమ్ముడు దూకుడు తగ్గలేదా?ysrcp;ntr;amala akkineni;shankar;tiru;jagan;2019;vishakapatnam;bus;capital;mandalam;mla;aqua;tdp;ycp;nandamuri taraka rama rao;ayyannapatrudu;dookuduSat, 09 Jan 2021 05:00:00 GMTటీడీపీ తిరుగులేని విజయాలు సాధించింది. అది కూడా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మంచి మంచి విజయాలు అందుకున్నారు. టీడీపీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2014 వరకు ఇక్కడ అయ్యన్నకు తిరుగులేదనే చెప్పాలి. 1983, 1985, 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన అయ్యన్న...1989, 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్లలో మంత్రిగా పనిచేశారు.

అయితే 2019 ఎన్నికల్లో సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తమ్ముడు ఉమా శంకర్ గణేశ్ చేతిలో అయ్యన్న ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే...ఉమా శంకర్ , అయ్యన్న శిష్యుడే. టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఉమా శంకర్.. గ్రామ స్థాయిలో ముఖ్య కార్యకర్తగా ఎదిగారు.

తర్వాత మండలస్థాయిలో పేరు తెచ్చుకొని.. నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడితో కలిసి పనిచేశారు. తర్వాత వైసీపీలో చేరి.. గురువుకే ప్రత్యర్థిగా మారారు. 2014లో జగన్ ఆశీస్సులతో నర్సీపట్నం టికెట్ దక్కించుకున్నారు. సీనియర్ నేత అయ్యన్నకు గట్టిపోటీనే ఇచ్చారు.. కేవలం 2,338 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి ఉమా శంకర్ దాదాపు 23 వేలపైనే మెజారిటీతో అయ్యన్నపై గెలిచారు.

తొలిసారి ఎమ్మెల్యే అయిన ఉమా శంకర్ ఏ మాత్రం అయ్యన్నకు పుంజుకునే ఛాన్స్ ఇవ్వకుండా దూసుకెళుతున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అటు ప్రభుత్వ పథకాలు అమలులో ఎలాంటి లోటు రానివ్వడం లేదు. ఆఖరికి టీడీపీ కార్యకర్తలకు సైతం పథకాలు అందేలా చేస్తున్నారు. ఇక నర్సీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుండటం ఉమా శంకర్‌కు బాగా ప్లస్ అయింది.

కాకపోతే నర్సీపట్నంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి కావల్సిన అవసరముంది. ప్రాధమిక రవాణా అవసరాలైన బస్సులు కూడా లేని గ్రామాలు నర్సీపట్నం పరిధిలో కోకొల్లలు. మున్సిపాలిటీ పరిధిలోగల కోటవురట్ల, వాతావరం ప్రాంతాలలో కూడా రహదారులు, మంచినీరు, పారిశుద్యం ప్రధాన సమస్యలు. గిరిజన ప్రాంతాలకు బస్సు సౌకర్యం లేదు. మాకవరపాలెం మండలంలో తాగు నీటి సమస్య, కొన్ని గ్రామాలకు రహదారులు లేవు.

అటు రాజకీయంగా చూసుకుంటే ఉమా శంకర్ బలంగానే ఉన్నారు. అలాగే అయ్యన్న కూడా దూకుడుగానే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విశాఖలో టీడీపీకి అండగా ఉంటున్నారు.  అమరావతికి మద్ధతుగా మాట్లాడుతుండటం వల్ల నర్సీపట్నంలో టీడీపీపై వ్యతిరేకిత పెరుగుతోంది. మొత్తానికైతే పూరీ తమ్ముడు ఉమా శంకర్ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నకు ఏ మాత్రం పుంజుకునే అవకాశం ఇవ్వడం లేదు.




ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>