MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-condition-of-the-theaters-is-questionable64656acc-d348-4117-aca7-2382377b0dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/the-condition-of-the-theaters-is-questionable64656acc-d348-4117-aca7-2382377b0dbe-415x250-IndiaHerald.jpgకేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంబంధిత జీవోను వెనక్కి తీసుకోవాలని.. 100 శాతం ఆక్యుపెన్సీ కుద‌ర‌ద‌ని.. ప్ర‌స్తుతం దేశంలో కొత్త క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేపథ్యంలో ఇలా థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఇస్తే క‌రోనా వ్యాప్తి విజృంభించే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. దీంతో సంక్రాంతి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సిందే. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు పెద్ద షాకే అయ్యింది. థియేట‌ర్ల‌కు పూర్తి శాతం ఆక్యుపెన్సీ ఇవ్వాల‌ని ఏపీ, తెలంగాణ‌, బెంగాల్‌తో పాటు ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు సినిమాtheatre;kranthi;kranti;makar sakranti;andhra pradesh;cinema;telugu;sankranthi;letter;central government;joshసంక్రాంతి సినిమాలు క్యాన్సిల్‌... ప్రేక్ష‌కుల‌కు మ‌ళ్లీ నిరాశే...!సంక్రాంతి సినిమాలు క్యాన్సిల్‌... ప్రేక్ష‌కుల‌కు మ‌ళ్లీ నిరాశే...!theatre;kranthi;kranti;makar sakranti;andhra pradesh;cinema;telugu;sankranthi;letter;central government;joshSat, 09 Jan 2021 16:11:00 GMTచాలా రోజుల త‌ర్వాత తెలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుండ‌డంతో ప్రేక్ష‌కుల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌రూ సినిమా కేవ‌లం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి హిట్ టాక్ సొంతం చేసుకోవ‌డంతో పాటు మంచి వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో ఇక సినిమాలు రిలీజ్ చేసుకోవ‌చ్చ‌ని తెలుగు సినీ నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఉన్నారు. ఇక త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను 100 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేసుకోవ‌చ్చ‌ని చెప్ప‌డంతో ఇక్క‌డ వాళ్ల‌కు కూడా మాంచి జోష్ వ‌చ్చింది.

అయితే ఈ ఆనందం మూడు నాళ్ల ముచ్చ‌టే అయ్యింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంబంధిత జీవోను వెనక్కి తీసుకోవాలని.. 100 శాతం ఆక్యుపెన్సీ కుద‌ర‌ద‌ని.. ప్ర‌స్తుతం దేశంలో కొత్త క‌రోనా వైర‌స్  వ్యాప్తి నేపథ్యంలో ఇలా థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఇస్తే క‌రోనా వ్యాప్తి విజృంభించే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. దీంతో సంక్రాంతి సినిమాలు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవాల్సిందే. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు పెద్ద షాకే అయ్యింది.

థియేట‌ర్ల‌కు పూర్తి శాతం ఆక్యుపెన్సీ ఇవ్వాల‌ని ఏపీ, తెలంగాణ‌, బెంగాల్‌తో పాటు ప‌లు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌కు సినిమా రంగం నుంచి విజ్ఞ‌ప్తులు వెళ్లాయి. దీంతో తెలుగులో కూడా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు న‌డుస్తాయ‌ని ఆశ‌లు పెట్టుకుని రిలీజ్ అవుతోన్న సంక్రాంతి సినిమాల‌కు పెద్ద షాకే త‌గిలిన‌ట్ల‌య్యింది. 100 ప్రేక్ష‌కులకు అనుమ‌తి ఇస్తే సంక్రాంతి సినిమాల‌కు అదిరిపోయే వ‌సూళ్లు ఉంటాయ‌నుకున్న ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు పెద్ద షాకే త‌గిలింది.

ఏదేమైనా ప్రభుత్వ నిర్ణ‌యంతో తెలుగు సినిమాకు సంక్రాంతి సంద‌డి కూడా పెద్ద‌గా ఉండ‌ద‌నే చెప్పాలి. ఇక క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ అయ్యాక స‌మ్మ‌ర్‌కే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తి వ‌చ్చేలా ఉంది. అప్ప‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీకి షాక్ త‌ప్ప‌దు. 


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>