PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news6e433a17-f3cb-48a4-8f95-a76fc139f4c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news6e433a17-f3cb-48a4-8f95-a76fc139f4c1-415x250-IndiaHerald.jpgఏపీలో స్థానిక ఎన్నికల సెగ తార స్థాయిలో రగులుతుంది. ఇటీవల హైకోర్ట్ స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని,ఎన్నికల కమిషన్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఎన్నికల కమిషనర్‌ను కలిసినవారిలో ఉన్నారlatest news;kumaar;anil music;krishna;raj;tara;jagan;andhra pradesh;high court;february;local language;anil kumar singhalస్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!latest news;kumaar;anil music;krishna;raj;tara;jagan;andhra pradesh;high court;february;local language;anil kumar singhalSat, 09 Jan 2021 10:00:00 GMTస్థానిక ఎన్నికల సెగ తార స్థాయిలో రగులుతుంది. ఇటీవల హైకోర్ట్ స్థానిక ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని,ఎన్నికల కమిషన్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపుల్ సెక్రటరీ గోపాల్ కృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఎన్నికల కమిషనర్‌ను కలిసినవారిలో ఉన్నారు. .

అయితే నిన్న జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సభ్యులు ఎన్నికలు వాయిదా వెళ్లాలని, స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, కోరగా సమావేశం ముగిసిన కొద్దిసేపటికే నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి సంచలనానికి తెర తీశారు. ఏకంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించి రాజకీయ దుమరాన్ని రేపారు. ఈనెల 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగోదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించారు. ఫిబ్రవరి 5న తొలిదశ ఎన్నికలు, 7న రెండో దశ, 9న మూడో దశ, 17న నాలుగో దశ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నట్లు షెడ్యూల్‌లో పేర్కొన్నారు. పోలింగ్‌ జరిగిన రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. దీంతో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినట్లయింది.

ఇదిలా ఉండగా ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతూ ఎన్నికల కమిషన్ కు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కానున్న నేపద్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని, ఇందు కోసం సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చెయ్యనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.మరి అటు ఎన్నికల కమిషన్,ఇటు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల పై వ్యతిరేక వైకరి ప్రదర్శిస్తున్న నేపద్యంలో సుప్రీం కోర్ట్ ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుందనేది ఆసక్తిక్రంగా మారింది.


రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ని టచ్ చేసిన త్రివిక్రం..?

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?

టీడీపీ నేతలు అమరావతి దాటి రారా...?

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>