Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/youtube-earnings50cd246d-2221-415a-b169-86da7ab0deb4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/youtube-earnings50cd246d-2221-415a-b169-86da7ab0deb4-415x250-IndiaHerald.jpgఒకప్పుడు మన ప్రతిభను ఎవరికైనా తెలియజేయలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేంది. ఒక్క అవకాశం కోసం ఎంతోమందిని వేడుకోవాల్సి వచ్చేది. ఓ ఉద్యోగం కావాలన్నా అంతే. ఎన్నో గడపలెక్కాలి. ఎంతో మందిని అర్థించాలి. అప్పుడు కానీ ఓ 10 రూపాయలు సంపాదించుకునే..youtube earnings;view;bharathi old;tiru;ram madhav;village;youtube;you tube;wife;research and analysis wingయూట్యూబ్‌లో నెలకు 5 లక్షల సంపాదన.. ఏం చేస్తున్నాడంటే..!యూట్యూబ్‌లో నెలకు 5 లక్షల సంపాదన.. ఏం చేస్తున్నాడంటే..!youtube earnings;view;bharathi old;tiru;ram madhav;village;youtube;you tube;wife;research and analysis wingSat, 09 Jan 2021 16:02:28 GMTభారతి దంపతులు.

రాందే, భారతి ఒకప్పుడు బ్రిటన్‌లో నివసించేవారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. మంచి జీతం.. గొప్ప లైఫ్.. కానీ అవి వారికి నచ్చలేదు. ఏదో వెలితిగా అనిపించింది. ముఖ్యంగా రాందే మనసెప్పుడూ తన గ్రామం చుట్టూనే తిరుగుతుండేది. పైగా తల్లిదండ్రులు కూడా గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలోని ఒక గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు. ఒక్కడే సంతానం కావడంతో వారు కూడా కొడుకుపై బెంగ పెట్టుకున్నారు. దీంతో రాందే ఎక్కువ కాలం అక్కడ ఉండలేక తిరిగి గ్రామానికి వచ్చేశాడు. 2016 నుంచి గ్రామంలోనే నివశిస్తున్నాడు. అయితే గ్రామానికి వచ్చేసినా ఖాళీగా ఉండకుండా.. వ్యవసాయంతోపాటు పశుపోషణ కూడా చేయడం ప్రారంభించారు.

సాధారణంగానే టెక్నాలజీతో ఎక్కువ అటాచ్‌మెంట్ ఉండడంతో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టాలనే ఆలోచన వచ్చింది. వ్యవసాయంతో పాటు పశుపోషణ వీడియోలను కూడా యూట్యూబ్‌లో పెట్టడం ప్రారంభించారు. మెల్లమెల్లగా ఆ వీడియోలకు వ్యూస్ పెరిగాయి. నెమ్మదిగా వ్యూస్ పెరిగాయి. సబ్‌స్క్రైబర్లు పెరిగారు. 6 నెలల్లో యూట్యూబ్ ఛానల్ మోనిటైజ్ అయ్యింది. అప్పటి నుంచి రోజుకు క్రమం తప్పక ఒక వీడియోను పోస్టు చేయడం మొదలు పెట్టారు. కొద్ది రోజుల్లోనే చానల్‌కు 3 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు అయ్యారు. నెమ్మదిగా ఒక్క చానల్ కాస్తా 3 చానళ్లకు పెంచారు. ఇప్పుడు మొత్తం చానళ్లకు కలిపి నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం తొలి చానల్‌కు 7 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీరితో పాటు ప్రతి రోజూ 1000 మంది కొత్తగా చేరుతున్నారు.

ఈ వీడియోల గురించి రాందే వివరించారు. తాను, తన భార్య భారతి పశువులకు గడ్డి తినిపిస్తూ, కట్టెల పొయ్యిపై వంట వండుతూ, పొలంలో పనిచేస్తూ.. వాటినే వీడియోలుగా తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తామని తెలిపారు. అలాగే గ్రామంలోని పెద్దలతో మాట్లాడుతున్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటామని చెప్పారు. వీరు రూపొందించే వీడియోలకు స్క్రిప్ట్ ఉండదు. ఎడిటింగ్ కూడా అంతగా ఉండదు. అయితే యూట్యూబ్‌లోని ఈ వీడియోలకు అమితమైన ఆదరణ లభిస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు ఉన్న ఆదరణే తమకు ఈ స్థాయి గుర్తింపు తెచ్చిపెట్టిందని రాందే చెబుతున్నారు.


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>