HealthNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/period-pains-in-winter1078d6a7-5026-43ba-bc79-b24b95b32d8f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/period-pains-in-winter1078d6a7-5026-43ba-bc79-b24b95b32d8f-415x250-IndiaHerald.jpgశీతాకాలంలో పీరియడ్ పెయిన్స్ ఎక్కువవడమనేది నేచురల్ ప్రాసెస్. దీన్ని మేనేజ్ చేయక తప్పదు. ప్రతి నెలా పీరియడ్స్ పలకరిస్తూ ఉంటాయి. వీటితో పాటు మూడ్ స్వింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ వంటి లక్షణాలు కూడా వస్తాయి. వీటికి తోడు, టెంపరేచర్ లో తగ్గుదల కూడా పీరియడ్ పెయిన్ ను పెంచే విషయంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. period pains in winter;cheque;house;dehydration;vవింటర్లో పీరియడ్ పెయిన్స్ ఎందుకు పెరుగుతాయో తెలుసా...?వింటర్లో పీరియడ్ పెయిన్స్ ఎందుకు పెరుగుతాయో తెలుసా...?period pains in winter;cheque;house;dehydration;vSat, 09 Jan 2021 16:00:00 GMT
అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డీహైడ్రేషన్:
శరీరం వివిధ విధులను పెర్ఫెక్ట్ గా నిర్వర్తించడం కోసం హైడ్రేషన్ అనేది మెయిన్ రోల్ పోషిస్తుంది. వింటర్ సీజన్ లో సహజంగానే తక్కువగా నీటిని తీసుకుంటారు. చల్లటి వాతావరణం వల్ల దాహం వేయడం తక్కువ. దాంతో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఇది బ్లడ్ ఫ్లోకు అంతరాయం కలిగిస్తుంది. పీరియడ్ పెయిన్ అనేది మరింత తీవ్రతరమవుతుంది.

ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం:
వింటర్ సీజన్ లో చాలామటుకు ఇంటికే పరిమితమవడానికి ఇష్టపడతారు. ఇంట్లోంచి జాగింగ్ కి గాని లేదా వాకింగ్ కి గాని బయటికి రావడానికి ఇష్టపడరు. ఫిజికల్ యాక్టిటివీ తగ్గడం వల్ల కూడా పీఎంఎస్ లక్షణాలు ఎక్కువవుతాయి. పీరియడ్ పెయిన్ పెరుగుతుంది.

శీతాకాలంలో కూడా పీరియడ్ పెయిన్ ను కొన్ని హోమ్ రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రకాల యోగాసనాలకు పీరియడ్ పెయిన్ ను తగ్గించే లక్షణం ఉంది. కాబట్టి, యోగాను డైలీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం వల్ల పీరియడ్ పెయిన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

పొత్తికడుపు, కాళ్ళు అలాగే నడుముకు వేడిని అప్లై చేయడం ద్వారా పీరియడ్ పెయిన్స్ నుంచి రిలీఫ్ ను పొందవచ్చు. ముఖ్యంగా, శీతాకాలంలో ఈ థెరపీ బాగా హెల్ప్ అవుతుంది.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవచ్చు. పీరియడ్ పెయిన్ అనేది ఆటోమేటిగ్గా తగ్గుతుంది.

వేధించే పీరియడ్ పెయిన్ కు ఈ చిట్కాలతో చెక్ పెట్టండి. అవసరమైతే వైద్యుల సూచనలు పొందండి. 


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>