EditorialMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagaddac92c5c67-ba5d-4ca2-a77c-43406932e6d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagaddac92c5c67-ba5d-4ca2-a77c-43406932e6d2-415x250-IndiaHerald.jpgప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించేశారు. దీంతో మరోసారి ఏపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వివాదం పల్లి మొదలైనట్టుగానే కనిపిస్తోంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం ఇప్పటిది కాదు. మొదటి నుంచి వీరి మధ్య వివాదాలు ఇదే విధంగా ఉంటూ వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు మనిషి అని, టిడిపికి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసిపి నాయnimmagadda ramesh jagan ysrcp ap local boady elect;kumaar;raj;telugu desam party;jagan;andhra pradesh;adinarayanareddy;telugu;panchayati;court;governor;letter;tdp;local language;supreme court;ycp;partyఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?ఎడిటోరియల్ : జగన్ వర్సెస్ నిమ్మగడ్డ ! ఆది నుంచి వివాదాస్పదమే ?nimmagadda ramesh jagan ysrcp ap local boady elect;kumaar;raj;telugu desam party;jagan;andhra pradesh;adinarayanareddy;telugu;panchayati;court;governor;letter;tdp;local language;supreme court;ycp;partySat, 09 Jan 2021 16:00:00 GMTప్రభుత్వం ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించేశారు. దీంతో మరోసారి ఏపీ ప్రభుత్వం వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య వివాదం  పల్లి మొదలైనట్టుగానే కనిపిస్తోంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం ఇప్పటిది కాదు. మొదటి నుంచి వీరి మధ్య వివాదాలు ఇదే విధంగా ఉంటూ వస్తున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు మనిషి అని, టిడిపికి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైసిపి నాయకులు అదేపనిగా ఆయనపై విమర్శలు చేస్తూనే వస్తున్నారు. అంతేకాకుండా నిమ్మగడ్డ వ్యవహారంపై ఏపీ గవర్నర్ కు ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయనను పదవి నుంచి తొలగించే వరకు పరిస్థితి వెళ్లింది. నిమ్మగడ్డ ను తప్పించి కొత్తగా కనగ రాజ్ అనే రిటైర్డ్ హైకోర్టు జడ్జి ని ఏపీ ఎన్నికల అధికారిగా నియమించారు. కానీ దీనిపై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లడం, కోర్టు తీర్పు నిమ్మగడ్డను అనుకూలంగా రావడంతో మళ్లీ ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. 



ఇదిలా ఉంటే ఏపీ పంచాయతీ ఎన్నికల పై మొదటి నుంచి వివాదం నడుస్తోంది. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఎంపీపీ, జడ్పిటిసి ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. దీంతో పలుచోట్ల ఏకగ్రీవాలు చెల్లవు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చేయడంతో ఆయన టిడిపి కి అనుకూలంగా పని చేస్తున్నారని, వైసిపి పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఏపీలో కరోనా ప్రారంభ సమయంలో ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం రేగింది. 



ఇక ఎన్నో ట్విస్ట్ ల అనంతరం ఏపీలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యవహారం కోర్టుకు వెళ్లడంతో, కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ,ఎన్నికల అధికారులు కలిసి సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించడంతో, ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం శుక్రవారం సిఎస్ మరో ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు ఎస్ఈసీ తో శుక్రవారం భేటీ అయ్యారు. ఆ సమావేశం ముగిసిన కొద్ది గంటల్లోనే షెడ్యూల్ విడుదల అవడంతో మరోసారి వివాదం మొదలైంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో మరో కొంతకాలం పాటు ఈ వ్యవహారం పై టెన్షన్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.


ఈ సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ అలాంటివే..!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!

కిషన్ రెడ్డి వర్సెస్ కేటిఆర్... పక్కపక్కనే ఉండి...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>