PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendarf5694e7b-e94f-4141-aa89-3cdac97cd9a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etela-rajendarf5694e7b-e94f-4141-aa89-3cdac97cd9a4-415x250-IndiaHerald.jpgతెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్ అందించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల తెలిపారు. జనవరి 2న 7సెంటర్లలో, జనవరి 8న 800 సెంటర్లలో కరోనా వాక్సిన్ డ్రైరన్ పూర్తి అయిందని స్పష్టం చేసారు. కరోనా వ్యాక్సిన్ వేయుటకు పది వేల మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. etela rajendar;eatala rajendar;january;minister;central government;etela rajenderతెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్తెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్etela rajendar;eatala rajendar;january;minister;central government;etela rajenderSat, 09 Jan 2021 20:35:09 GMT
దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇక జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు శనివారం కేంద్రం వెల్లడించింది. కాగా భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌తో పాటు ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు  భారత ఔషధ నియంత్రణ మండలి ఆమోద ముద్ర వేసిన విషయం తెల్సిందే. ముందుగా దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్ కు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది.  తర్వాత  50 ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి మొత్తం 27 కోట్ల మంది అందించనున్నట్లు వెల్లడించింది.

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లను చేస్తున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటికే రెండు విడతలుగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డ్రై రన్ లు పూర్తి అయ్యాయి. జనవరి 2న ఏడు సెంటర్లలో, జనవరి 8న 800 సెంటర్లలో కరోనా వాక్సిన్ డ్రైరన్ పూర్తి  చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రభుత్వ హాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా  డ్రైరన్ నిర్వహిస్తున్నాయని అన్నారు.

రాష్ట్రంలో 2 లక్షల 90 వేల మందికి కరోనా  వాక్సిన్ వేయనున్నట్లు మంత్రి చెప్పారు. ముందుగా ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి  కరోనా వ్యాక్సిన్ అందిస్తామని స్పష్టం చేసారు. ఇక కరోనా వ్యాక్సిన్ వేయుటకు పది వేల మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక కరోనా కొత్త స్ట్రెయిన్‌ వైరస్ గురించి కూడా మంత్రి స్పందించారు. కొత్త స్ట్రెయిన్‌ వైరస్ పై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ఇక రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ వల్ల ఎలాంటి నష్టం లేదని, బర్డ్‌ ఫ్లూ విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.



బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?

పూజారులు, జర్నలిస్టులపై కేసులా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>