MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-vadhulukinna-block-baster-movies-ento-thelusaa33cd9a28-52b2-4834-9a0e-a7eadeca7728-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-chiranjeevi-vadhulukinna-block-baster-movies-ento-thelusaa33cd9a28-52b2-4834-9a0e-a7eadeca7728-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. మెగాస్టార్ తన స్టెప్పులతో, నటనతో,టైమింగ్ డైలాగ్ డెలివరీతో చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకొని, నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. 40 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ ఏలూతూ తన నంబర్ వన్ స్థానాన్ని వదులుకోకుండా వస్తున్నారు చిరంజీవి. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ లో గొప్ప నటనతో, ఎంతోమంది స్టార్లు పోటీ పడుతున్నప్పటికీ, తన స్థానాన్ని మాత్రం ఎవరూ చేదించలేకపోయారు. అంతటి మహోన్నత స్థానాన్ని పొందిన వారు మెగాస్టాmegastar chiranjeevi;chiranjeevi;rajinikanth;ram gopal varma;sridevi kapoor;suresh;krishna;puri jagannadh;ram pothineni;india;andhra pradesh;ram madhav;cinema;telugu;rajani kanth;tamil;film industry;industry;blockbuster hit;director;khaidi.;thief;research and analysis wing;jagadeka veerudu athiloka sundari;khaidi new;donga;andhrawalaమెగాస్టార్ చిరంజీవి వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా?మెగాస్టార్ చిరంజీవి వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా?megastar chiranjeevi;chiranjeevi;rajinikanth;ram gopal varma;sridevi kapoor;suresh;krishna;puri jagannadh;ram pothineni;india;andhra pradesh;ram madhav;cinema;telugu;rajani kanth;tamil;film industry;industry;blockbuster hit;director;khaidi.;thief;research and analysis wing;jagadeka veerudu athiloka sundari;khaidi new;donga;andhrawalaSat, 09 Jan 2021 12:45:45 GMTమెగాస్టార్ చిరంజీవి పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. మెగాస్టార్ తన స్టెప్పులతో, నటనతో,టైమింగ్ డైలాగ్ డెలివరీతో చిన్న పెద్ద  అని తేడా లేకుండా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకొని, నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. 40 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీ ఏలూతూ తన నంబర్ వన్ స్థానాన్ని వదులుకోకుండా వస్తున్నారు చిరంజీవి. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ లో  గొప్ప నటనతో, ఎంతోమంది స్టార్లు పోటీ పడుతున్నప్పటికీ,  తన స్థానాన్ని మాత్రం ఎవరూ చేదించలేకపోయారు. అంతటి మహోన్నత స్థానాన్ని పొందిన వారు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీ బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు ఒక దశాబ్దం తర్వాత తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా అరంగేట్రం చేశారు. ఈ  సినిమా 100 కోట్ల షేర్ మార్కుని కొల్లగొట్టి, రికార్డుల మోత మోగించి  తిరిగి నంబర్వన్ స్థానానికి తెచ్చిపెట్టింది. మెగాస్టార్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.


సూపర్ స్టార్ రజినీకాంత్ కెరియర్లో బాషా సినిమా ఎలాంటి స్థానాన్ని సంపాదించి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం తమిళ్ ఇండస్ట్రీ కే పరిమితమైన రజినీకాంత్ బాషా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి,ప్రపంచం నలుమూలలా తన ఉనికిని చాటుకున్నాడు. ఈ సినిమా అప్పట్లో  1995వ  సంవత్సరంలోనే  40 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూల్ చేసుకుంది. ఈ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ మొదటగా ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్ తో, తెలుగులో మెగాస్టార్ చిరంజీవి తో తీయాలని డేట్స్ కూడా ఇచ్చేశాడు. కానీ అప్పటికే చిరంజీవి వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయలేకపోయాడు.

పట్టువదలని విక్రమార్కుడిలా దర్శకుడు సురేష్ కృష్ణ మరోసారి చిరంజీవితో పాన్ ఇండియా మూవీ తీయాలనే కోరికతో అబు అనే సినిమాను స్టార్ట్ చేశాడు.  కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఒక డైరెక్టర్ కల కలగానే మిగిలిపోయింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు అల్లాడిస్తున్న రోజుల్లో విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం కలెక్షన్ల వరదను మాత్రం  ఆపలేదు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ ఈ సినిమా తిరగరాసింది. వాస్తవానికి చిరంజీవి,శ్రీదేవి కాంబినేషన్ లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కి ముందే వజ్రాల దొంగ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు శ్రీదేవి తన సొంత నిర్మాణంలో తీద్దాం అనుకున్నారు.  కాని కొన్ని కారణాల చేత సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది.

రాంగోపాల్ వర్మ, చిరంజీవి కాంబినేషన్ లో అప్పట్లో ఒక సినిమా ప్రారంభమై 50 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పాపెట్టకుండా బాలీవుడ్లోకి వెళ్లిపోవడంతో ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.  ఈ కారణం చేతనే ఇప్పటివరకు రాంగోపాల్ కు,చిరంజీవికి మాటలు లేవని ఇండస్ట్రీలో  వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఆంధ్రావాలా సినిమాని కూడా చిరంజీవి తో తీద్దాం అనుకున్నారు పూరి జగన్నాథ్.ఈ కథను చిరంజీవికి వినిపించాడు. అయితే ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది,ఇక రెండవ  ఆఫ్ నచ్చకపోవడంతో చిరంజీవి సినిమా తీయడానికి ఒప్పుకోలేదు.




తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!

గుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>