PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan45f3e5ee-8af1-4109-8c43-97a1227d8e45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan45f3e5ee-8af1-4109-8c43-97a1227d8e45-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్దిసేపటికే జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్ పంపించిన నోటిఫికేషన్ తమకు అందిందని, అయితే దీన్ని తాము అంగీకరించేది లేదని సీఎస్ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.nimmagadda prasad;kumaar;krishna;jogi ramesh;jagan;andhra pradesh;january;panchayati;court;mla;election;local language;central government;supreme court;ycp;pedanaఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన జగన్ సర్కార్...ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించిన జగన్ సర్కార్...nimmagadda prasad;kumaar;krishna;jogi ramesh;jagan;andhra pradesh;january;panchayati;court;mla;election;local language;central government;supreme court;ycp;pedanaSat, 09 Jan 2021 08:10:00 GMTపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసిన కొద్దిసేపటికే జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ శుక్రవారం అర్ధరాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్ పంపించిన నోటిఫికేషన్ తమకు అందిందని, అయితే దీన్ని తాము అంగీకరించేది లేదని సీఎస్ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోందని, రాష్ట్రంలో ఇప్పటికే రెండుసార్లు వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ నిర్వహించామని నిమ్మగడ్డ రమేష్‌కు సీఎస్‌ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సూచనలతో అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగమంతా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉందని.. గ్రామ వలంటీర్ల నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో విధులు నిర్వర్తించాల్సి ఉందని సీఎస్‌ తెలిపారు. కాబట్టి, రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.


ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సును మనసులో ఉంచుకుని ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు. ఇక, ఎన్నికల కమిషన్‌ ప్రొసీడింగ్స్‌పై జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సుప్రీంకోర్టుకు వెళతామని చెబుతున్నారు. అయితే ఎన్నికలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎన్నికలు వాయిదా వేయాలని ఏపీ ఎన్జీవో సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి కోరారు. ఇక, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ఎస్ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం రాత్రి మరో సంచలనానికి తెరతీశారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని, ఎలక్షన్స్ వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం కోరిన గంట్లోనే నిమ్మగడ్డ రమేష్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏకంగా శనివారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. జనవరి 23వ తేదీ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఈ తరుణంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు.


కాలి కింద రాయి.. 20 ఏళ్ల తరువాత కోట్లు తెచ్చి పెట్టింది

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>