PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtku-hajaraina-ap-dgp17813029-943b-41e1-a0dc-8ba8ee483e59-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో దేవాలయలపై దాడుల అంశం ఇప్పుడు ఏపీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. రాజకీయంగా విపక్షాలు తీవ్ర స్థాయిలో దీనిపై ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఏపీలో బిజెపి, టీడీపీ ఇప్పుడు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు కూడా చేసే పరిస్థితి ఉందనే మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు దీని మీద చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. ఈ ఘటనల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఉన్నతాధికారులు. సిఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటన మీద చాలా సీరdgp;cbn;ashok kumar;kumaar;ashok;bharatiya janata party;jagan;vijayawada;andhra pradesh;police;september;director;tdp;anti-corruption bureauదేవాలయాలపై దాడులు... డీజీపీ కీలక నిర్ణయందేవాలయాలపై దాడులు... డీజీపీ కీలక నిర్ణయంdgp;cbn;ashok kumar;kumaar;ashok;bharatiya janata party;jagan;vijayawada;andhra pradesh;police;september;director;tdp;anti-corruption bureauSat, 09 Jan 2021 08:20:42 GMTఆంధ్రప్రదేశ్ లో దేవాలయలపై దాడుల అంశం ఇప్పుడు ఏపీ పోలీసులకు సవాల్ గా మారింది. ఈ దాడులు ఎవరు చేస్తున్నారు అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. రాజకీయంగా విపక్షాలు తీవ్ర స్థాయిలో దీనిపై ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఏపీలో బిజెపి, టీడీపీ ఇప్పుడు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుని ఉద్యమాలు కూడా చేసే పరిస్థితి ఉందనే మాట వాస్తవం. అయితే  ఇప్పుడు ఏపీ పోలీసులు దీని మీద చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. ఈ ఘటనల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఉన్నతాధికారులు.

సిఎం వైఎస్ జగన్ కూడా ఈ ఘటన మీద చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. దీని వెనుక కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొన్ని రాజకీయ పక్షాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సర్కార్ కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులపై సిట్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. గతేడాది సెప్టెంబర్ నుంచి జరుగుతోన్న దాడులపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసారు.

కృష్ణాజిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్ బాబుతో పాటు 16 మంది సభ్యులు ఉంటారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు ఏసీపీలు, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసారు. అన్ని జిల్లాల ఎస్పీలు ఈ బృందానికి సహకరించాలి  అని ఏపీ డీజీపీ గౌతం సూచించారు. సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు కూడా సిట్ బృందానికి సహకరించాలి అని ఆయన ఆదేశించారు. కేసుల తీవ్రత దృష్ట్యా సైబర్ క్రైమ్ విజయవాడ, విశాఖపట్నం బృందాలు సిట్ బృందానికి సహకరించాలి అని పేర్కొన్నారు. సిట్ బృందం ఎప్పటికప్పుడు కేస్ దర్యాప్తు పురోగతిని శాంతిభద్రతల అడిషనల్ డీజీకి వివరించాలి అని స్పష్టం చేసారు.


కాలి కింద రాయి.. 20 ఏళ్ల తరువాత కోట్లు తెచ్చి పెట్టింది

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>