PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhatti-vikramarkae5684606-4a6d-4bca-91df-ac457f346f0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhatti-vikramarkae5684606-4a6d-4bca-91df-ac457f346f0b-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ శాసనసభాపక్షం చేసిన ఒక్క రోజు రైతు దీక్ష విజయవంతం అయింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మొత్తంగా విభేధాలు పక్కన పెట్టి ఈ దీక్షలో పాల్గొన్నడం విశేషం. రైతు దీక్ష పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క మరోమారు ఏకం చేసినట్లు అయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్ద రైతు ద్రోహి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలోని రైతాంగంతో మాట్లాడేందుకు రైతులుతో ముఖాముఖి కార్యక్రమాన్ని సీఎల్పీ ఆద్వర్యంలో మొదలు పెడుతున్నట్లు ఆయన bhatti;kcr;kumaar;anil music;jeevan;kranthi;kranti;ramu;ravi anchor;revanth;sridhar;kerala;delhi;telangana rashtra samithi trs;india;korcha;uttam kumar reddy nalamada;telangana;narendra modi;indira gandhi;revanth reddy;congress;media;village;chief minister;parliment;minister;janareddy;central government;mallu bhatti vikramarka;jagga reddy;reddy;nayakపాలన వ్యాపారం కాదు.. కేసీఆర్ ను తూర్పార ప‌ట్టిన భ‌ట్టి..పాలన వ్యాపారం కాదు.. కేసీఆర్ ను తూర్పార ప‌ట్టిన భ‌ట్టి..bhatti;kcr;kumaar;anil music;jeevan;kranthi;kranti;ramu;ravi anchor;revanth;sridhar;kerala;delhi;telangana rashtra samithi trs;india;korcha;uttam kumar reddy nalamada;telangana;narendra modi;indira gandhi;revanth reddy;congress;media;village;chief minister;parliment;minister;janareddy;central government;mallu bhatti vikramarka;jagga reddy;reddy;nayakSat, 09 Jan 2021 19:05:33 GMTకాంగ్రెస్ శాసనసభాపక్షం చేసిన ఒక్క రోజు రైతు దీక్ష విజయవంతం అయింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మొత్తంగా విభేధాలు పక్కన పెట్టి ఈ దీక్షలో పాల్గొన్నడం విశేషం. రైతు దీక్ష పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వాన్ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్రమార్క మరోమారు ఏకం చేసినట్లు అయింది.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్ద రైతు ద్రోహి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణలోని రైతాంగంతో మాట్లాడేందుకు రైతులుతో ముఖాముఖి కార్యక్రమాన్ని సీఎల్పీ ఆద్వర్యంలో మొదలు పెడుతున్నట్లు ఆయన మీడియా ముఖంగా ప్రకటించారు.


 కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆద్వర్యంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం శనివారం నాడు ఇందిరా పార్క్ వద్ద ఒక్కరోజు రైతు దీక్ష చేసింది. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, కుసుమ్ కుమార్, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, రాజయ్య, బలరామ్ నాయక్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నా లక్ష్యయ్య, వీ హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి, మల్లు రవి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను వెనక్కు తీసుకునేవరకూ ఈ రైతాంగ పోరాటం కొనసాగుతందని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ పార్లమెంట్ లో సరైన బలం లేకపోయినా.. ఇక్కడి ప్రజల ఆకాంక్షను ద్రుష్టిలో పెట్టుకునే సోనియమ్మ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఇక్కడి వనరులు అందరికీ పంచబడతాయని, రైతాంగ సోదరులకు తల ఎత్తుకుని ఆత్మ గౌరవంతో నిలదొక్కుకుంటారని, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు దొరుకుతాయని,  సామాజిక తెలంగాణ ఏర్పడుతేందని భావిస్తే.. అలా జరగలేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.


 రైతు చట్టాలను వ్యతిరేకించాలని గతంలో కాంగ్రెస్ శాసనసభా పక్షం ముఖ్యమంత్రికి గతంలో అనేక సార్లు చెప్పిందని భట్టి వివరించారు. తాజాగా కేరళ సహా చాలా రాష్ట్రాల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలే ఏర్పాటు చేసి.. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానాలు చేశాయి.  ఆ విధంగానే చేయాలని గతంలోనే కేసీఆర్ కు సూచించినట్లు భట్టి చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఏడేళ్లుగా వ్యవసాయం ఏమైందో అందరికీ తెలుసన్నారు. ఆనాడు రైతుల రక్షణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన చట్టాలన్నీ రద్దు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డ్రిప్, స్ప్రింక్లర్, పాలిహౌజ్, అగ్రికల్చర్ ఎక్విప్ మెట్లుకు సబ్సిడీలు ఇచ్చేవారమని.. ఇప్పుడవన్నీ లేవని వివరించారు. పావలా వడ్డీకే రుణాలు, సబ్సిడీతో నాణ్యమైన విత్తనాలను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని చెప్పారు.


నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు బాగా పండించే రైతులను ప్రోత్సహించడం కోసం ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) సొసైటీల ద్వారా మద్దతు ధరతో దళారీల బెడద లేకుండా పంటను కొనుగోలు చేసిందని చెప్పారు. కానీ కేసీఆర్ పంటను కొనలేము.. పంటను కొనడం వల్ల నష్టం వస్తోందని కొనుగోలు కేంద్రాలను ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ద్రోహిగా మారిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. గ్రామాల్లో రైతు సంఘాలు మళ్లీ మొదలైతే.. ఏ ఒక్క గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త, నాయకుడు తిరగలేడని భట్టి హెచ్చరించారు. కేసీఆర్.. పాలన అంటే వ్యాపారం కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రాజ్యాంగం గురించి పూర్తిగా తెలుసుకోవాలని భట్టి సూచించారు.


రాజ్యంగం ప్రకారం.. మనది శ్రేయో రాజ్యమని అన్నారు. రాష్ట్రంలోని వనరులను ప్రజల అభివ్రుద్దికే కేటాయించాలన్నారు. పరిపాలన అంటే వ్యాపారం కాదని భట్టి తీవ్రస్థాయిలో మండపడ్డారు. రూ.7500 కోట్ల నష్టం వస్తుంది కాబట్టి కొనను అంటే కుదరదని బట్టి హెచ్చరించారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనలేదా? సబ్సిడీకి రుణాలు, ఇవ్వలేదా, రుణమాఫీ చేయలేదా అని భట్టి ఆగ్రహంగా కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓక తుపాకి రాముడని భట్టి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్ బంద్ సమయంలో కాంగ్రెస్ వెనకాల దీక్షకు కూర్చుని తుపాకి రాముడిలా మాటలు చెప్పి.. ఢిల్లీ వెళ్లి.. మోదీ కాళ్ల దగ్గర సాగిల పడి.. చట్టాలపై యూ టర్న్ తీసుకున్నాడని మండి పడ్డారు.


మొత్తం రైతాంగానికి కేసీఆర్ ద్రోహం చేశాడని అన్నారు. రైతులను కాపాడు కోవాలన్న ఆలోచన్న వారు, రైతుల కూలీలను రక్షించుకోవాలన్న ఆశ ఉన్నవారు.. వినియోగదారులను అధిక ధరల బాధల నుంచి తప్పించాలనుకున్నవారు.. ఎవరైనా సరే టీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లో అడ్డుకోవాలని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వారిని గ్రామాల్లో తిరగనీయవద్దని చెప్పారు. 


తెలంగాణలో 2.90 లక్షల మందికి కరోనా వాక్సిన్

బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>