MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde-rashmika9852dfbc-a14e-4670-b5de-cf155ead43a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde-rashmika9852dfbc-a14e-4670-b5de-cf155ead43a3-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం వరస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. పూజా అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటుంది. pooja hegde rashmika;prabhas;mammootty;pooja hegde;salman khan;akhil akkineni;dulquer salmaan;geetha;hanu ragavapudi;rashmika mandanna;shyam;vishal krishna;bollywood;cinema;sangeetha;tamil;hero;letter;thota chandrasekhar;heroine;hanu raghavapudi;sultan;dhruva;chitram;vyjayanthi moviesఒకే సినిమాలో నటించనున్న పూజా హెగ్డే, రష్మిక..!?ఒకే సినిమాలో నటించనున్న పూజా హెగ్డే, రష్మిక..!?pooja hegde rashmika;prabhas;mammootty;pooja hegde;salman khan;akhil akkineni;dulquer salmaan;geetha;hanu ragavapudi;rashmika mandanna;shyam;vishal krishna;bollywood;cinema;sangeetha;tamil;hero;letter;thota chandrasekhar;heroine;hanu raghavapudi;sultan;dhruva;chitram;vyjayanthi moviesSat, 09 Jan 2021 11:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం వరస సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. పూజా అయితే ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటుంది. రష్మిక ఇప్పుడు బన్నీతో పుష్ప.. శర్వానంద్ తో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలతో పాటు తమిళంలో కార్తితో సుల్తాన్.. కన్నడలో ధృవ సర్జతో పొగరు సినిమాల్లో నటిస్తుంది.

థ్యాంక్ యూ సినిమాతో పాటు దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా పూజా, రష్మిక నటించబోతున్నారని తెలుస్తుంది. మమ్ముట్టి తనయుడు, సెన్సేషనల్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. హను రాఘవపూడి ఈ సినిమాని తెలుగు, తమిళం, మలయాళంలో తెరకెక్కిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో సైనికుడిగా నటిస్తున్నాడు దుల్కర్.

ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, రష్మిక మందన్నలను తీసుకోవాలని చూస్తున్నాడు హను. ఇప్పటికే కథ చెప్పి ఒప్పించడమే కాకుండా ఒప్పందాలు కూడా పూర్తి చేసాడని తెలుస్తుంది. దాదాపు 40 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు హను రాఘవపూడి. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఏదేమైనా కూడా ఒకే సినిమాలో ఇద్దరు టాప్ హీరోయిన్లను తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. పైగా ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడితో ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం కూడా చిన్న మ్యాటర్ కాదు. కానీ అక్కడ దుల్కర్ సల్మాన్ ఉన్నాడు. ఈయనకు ఉన్న ఫాలోయింగ్ కారణంగానే ఇద్దరు బ్యూటీస్ నటించడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


జ‌గ‌న్ అనుకున్న‌ది ఒక‌టి.. జ‌రిగింది మ‌రొక‌టి.. ఊహించ‌లేదా..?

అమ్మ ఒడికి భారీ బ్రేక్...ఏపీ అంతటా ఎన్నికల కోడ్

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?

స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు కు వెళ్తాం..జగన్ ప్రభుత్వం !!

2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ట్రంప్ కు " క్షమా భిక్ష" సాద్యమేనా ..!!

హైదరాబాద్‌లో ఈ ప్లేస్‌ చూశారా.. చూడకపోతే మీరు చాలా మిస్‌ అయినట్టే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>