PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war49b57b53-1bf5-4909-a582-b99123b7248f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/greater-war49b57b53-1bf5-4909-a582-b99123b7248f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వడాన్ని మేము తప్పు బడుతున్నాం, ఆక్షేపిస్తున్నాం అని అన్నారు. ఏపీ లో కరోన ఎలా నియంత్రణ లోనికి వచ్చింది అనేది ఎన్నికల సంఘం తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగులు కరోన సమయంలో పనిచేసినందునే నియంత్రణ లోకి వచ్చింది అని ఆయన స్పష్టం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్, బ్రిటన్ స్ట్రైన్ వస్తుంది అని చెపుతున్నారు అని అన్నారు. ఎన్నికల విషయం లో ఎస్ ఈelections, ap;andhra pradesh;local languageఎన్నికలను బహిష్కరిస్తూ ఉద్యోగ సంఘాల సంచలన ప్రకటనఎన్నికలను బహిష్కరిస్తూ ఉద్యోగ సంఘాల సంచలన ప్రకటనelections, ap;andhra pradesh;local languageSat, 09 Jan 2021 12:42:20 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యాలయం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వడాన్ని మేము తప్పు బడుతున్నాం, ఆక్షేపిస్తున్నాం అని అన్నారు. ఏపీ లో కరోన ఎలా నియంత్రణ లోనికి వచ్చింది అనేది ఎన్నికల సంఘం తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగులు కరోన సమయంలో పనిచేసినందునే నియంత్రణ లోకి వచ్చింది అని ఆయన స్పష్టం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్, బ్రిటన్ స్ట్రైన్ వస్తుంది అని చెపుతున్నారు అని అన్నారు.

ఎన్నికల విషయం లో ఎస్ ఈ సి  వ్యక్తిగత ప్రతిష్టకు పోవద్దు అని ఆయన హితవు పలికారు. ఉద్యోగులు ఎన్నికల విధులకు మానసికంగా సిద్ధంగా లేరు అని స్పష్టం చేసారు. ఎన్నికల సంఘం ఏకపక్ష విధానం సమంజసం కాదు అని అన్నారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ని దృష్టి లో పెట్టుకోవాలి అని ఆయన సూచించారు. వాక్సినేషన్ పూర్తి అయ్యాక ఎన్నికలు పెట్టాలి అని డిమాండ్ చేసారు. కనీసం ఫ్రంట్ లైన్ వారియోర్స్ కు వాక్సినేషన్ వేశాక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలి అని సూచించారు.

ఇక ఇదిలా ఉంటే ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రకటన చేసాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయడంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేసాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించమని ఉద్యోగ సంఘాల ఏకగ్రీవ తీర్మానం చేసాయి. ఉద్యోగుల,ప్రభుత్వం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘాలు... ఎన్నికల కమిషన్ కు తాము సహకరించమని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికలను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేసారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా  ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిందని వారు ఆరోపణలు చేసారు.


మెగాస్టార్ చిరంజీవి వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>