PoliticsSreekanth Eeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harishrao5875b1c2-a6aa-4936-b48b-d9892170986b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harishrao5875b1c2-a6aa-4936-b48b-d9892170986b-415x250-IndiaHerald.jpgమెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో పోచంరాల్ వద్ద నిర్మించిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. రూ. 43.23 లక్షల కంపా నిధులు, రూ.20 లక్షల బయోసాట్ నిధులతో దీనిని నిర్మించారు. రాష్ట్రంలో పర్యావరణ హితమైన సమతుల్య అభివృద్ధిపై దృష్టి పెట్టామని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణను మలుచుకునే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. harishrao;prakruti;samatha;district;minister;central government;medak;manamపర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావుపర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావుharishrao;prakruti;samatha;district;minister;central government;medak;manamSat, 09 Jan 2021 21:04:10 GMTమెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో పోచంరాల్ వద్ద నిర్మించిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక  మంత్రి హరీష్ రావు శనివారం ప్రారంభించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పోచారం అభయారణ్యం ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ  పర్యావరణ విజ్ఞాన కేందాన్ని నిర్మించింది. రూ. 43.23 లక్షల కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (కంపా) నిధులు, రూ.20 లక్షల బయోసాట్ నిధులతో  పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించారు.

అడవి, జంతువులు, పర్యావరణం ప్రాధాన్యత తెలిపేలా నమూనాలు, సందర్శకుల వసతులను ఇక్కడ అటవీ శాఖ ఏర్పాటు చేసింది.  ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు చుట్టు పక్కన జిల్లాలు,  రాష్ట్ర ప్రజలకు ప్రకృతి వన్య జీవుల పట్ల అవగాహణ కల్పించేలా ఈ పర్యావరణ విజ్ఞాన కేంద్రం నిర్మాణం జరిగింది. ముఖ్యంగా స్కూలు పిల్లలకు పర్యావరణం, పచ్చదనం పెంపుపై స్ఫూర్తి కలిగించేలా ఈ సెంటర్ ను తీర్చిదిద్దారు.

 ఈ పర్యావరణ విజ్ఞాన కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..  రాష్ట్రంలో పర్యావరణ హితమైన సమతుల్య అభివృద్ధిపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు అత్యంత నివాసయోగ్యమైన రాష్ట్రంగా తెలంగాణను మలుచుకునే పనిలో ఉన్నామని స్పష్టం చేసారు. ఇందులో భాగంగానే తెలంగాణకు హరితహారంలో భాగంగా జంగల్ బచావో, జంగల్ బడావో నినాదం తీసుకున్నామని ఉన్న అడవిని కాపాడుకోవటం, కొత్తగా పచ్చదనం పెంచుకోవటం మనందరి కర్తవ్యం కావాలి అని అన్నారు. పర్యావరణం, అడవులు ఉంటేనే మనకు పీల్చేగాలి స్వచ్చంగా దొరుకుతుందని, లేదంటే ఇప్పుడు నీళ్లు కొనుక్కుంటున్నట్లే రానున్న రోజుల్లో ఆక్సీజన్ ను కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందని అన్నారు.  ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు విడతల్లో సుమారు 210 కోట్ల మొక్కలు నాటామని, ప్రతి ఒక్కరూ వాటిని రక్షించేందుకు, పెంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 


బాలయ్య చిన్న అల్లుడికి బాబు కీలక పదవి

భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిజమే! అంగీకరించిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త

“ఆమె భారతదేశం ఇచ్చిన కూతురు” భారతమహిళ పై బిడెన్ ప్రశంసల జల్లు..!!

నిమ్మగడ్డ... డైరెక్ట్ గా ఆ మాట ఎందుకు మాట్లాడారు...?

ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్!

తిరుపతి టీడీపీ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయట..?

పూజారులు, జర్నలిస్టులపై కేసులా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sreekanth E]]>