MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sooda25d19c7-0a37-4ffc-98ed-70f5e690b9d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sonu-sooda25d19c7-0a37-4ffc-98ed-70f5e690b9d0-415x250-IndiaHerald.jpgచిత్ర పరిశ్రమలో సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కరోనా సమయంలో అందరికి అండగా నిలిచిన రియల్ హీరో సోనూసూద్ వివాదాల్లో ఇరుక్కున్నారు. వెండితెరపై విలన్ గా నటించిన ఆయన రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. లాక్ డౌన్‌లో ఎంతోమందికి ఆశ్రయం కల్పించి దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సోనూ సూద్‌ పై కేసు నమోదు అయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోనూసూద్ పై లీగల్ కేసు పెట్టింది.sonu sood;mumbai;maharashtra - mumbai;high court;police;maharashtra;hero;shaktiనటుడు సోనూసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు..!?నటుడు సోనూసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు..!?sonu sood;mumbai;maharashtra - mumbai;high court;police;maharashtra;hero;shaktiSat, 09 Jan 2021 09:00:00 GMTహీరో సోనూసూద్ వివాదాల్లో ఇరుక్కున్నారు. వెండితెరపై విలన్ గా నటించిన ఆయన రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. లాక్ డౌన్‌లో ఎంతోమందికి ఆశ్రయం కల్పించి దేశ వ్యాప్తంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన సోనూ సూద్‌ పై కేసు నమోదు అయ్యింది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సోనూసూద్ పై లీగల్ కేసు పెట్టింది.

జూహూ ప్రాంతంలో శక్తి సాగర్‌ అనే పేరుతో సోనూ సూద్‌కి ఆరు అంతస్తుల భవనం ఉంది. నివాస భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా సోనూ సూద్ హోటల్‌గా మార్చారని ఆరోపిస్తూ మహారాష్ట్ర రీజనల్ అండ్ టౌన్ ప్లానింగ్ నిబంధనలను సోనూ సూద్ ఉల్లంఘించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే బీఎంసీ తనపై చేసిన ఆరోపణల్ని సోనూసూద్ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ నుంచి అనుమతులు రావాల్సి ఉండగా.. లాక్ డౌన్ వల్ల ఆలస్యమైందని ఒకవేళ అనుమతులు రాకపోతే దాన్ని తిరిగి నివాస సముదాయంగా మార్చేస్తామని వివరణ ఇచ్చారు. అయితే ఇది లీగల్ ఇష్యూ కావడంతో.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని ముంబై పోలీసులు తెలిపారు.

హైకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు మూడువారాల సమయం ఇచ్చింది. సమయం పూర్తి కావడంతో ప్రణాళిక ప్రకారం మార్పులు, చేర్పులు చేయకపోవడంతో ఎంఆర్‌పీటీ చట్టంకింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఓ బీఎంసీ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సోనుసూద్‌ స్పందిస్తూ.. భవనానికి అన్ని అనుమతులు ఉన్నాయని, ఎంసీజెడ్‌ఎంఏ అనుమతి కొవిడ్‌ కారణంగా రాలేదని తెలిపారు. మహమ్మారి సమయంలో కొవిడ్‌ యోధులను ఉంచేందుకు ఈ హోటల్ వినియోగించినట్లు తెలిపారు. అనుమతులు రాకపోతే, భవనాన్ని తిరిగి నివాసంగా మారుస్తానని చెప్పాడు.


2021లో 20 ఎమ్మెల్సీ పదవుల భర్తీ!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>