MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikramffb7b800-a8f2-4f0b-8bce-cbebe3f63a30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/trivikramffb7b800-a8f2-4f0b-8bce-cbebe3f63a30-415x250-IndiaHerald.jpgమహాభారతం ని సినిమా రూపంలో తెరకెక్కించాలని టాలీవుడ్ లో చాలామంది దర్శక దిగ్గజాలు ప్రయత్నిస్తున్నారు.. నిర్మాత అల్లు అరవింద్ కూడా తన బ్యానర్ లో మహాభారతం ని తెరకెక్కించాలని చూస్తుండగా రాజమౌళి అయితే ఇది ఏకంగా తన డ్రీం ప్రాజెక్ట్ అని కూడా చెప్పాడు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఈ సినిమా ని దేశంలో చాలామంది ప్రముఖులు తెరకెక్కించాలని ముచ్చటపడుతున్నారు. అయితే ఈ సినిమా చేయాలంటే మాములు కాదు. బాహుబలి లాంటి సినిమా చేసిన రాజమౌళి ఈ సినిమా చేయాలంటే తడబడుతున్నాడు.. trivikram;ntr;allu aravind;rajamouli;trivikram srinivas;india;tollywood;cinema;bahubali;producer;director;producer1;nandamuri taraka rama raoఎన్టీఆర్ తర్వాతే త్రివిక్రమ్ మహాభారతం మొదలుపెడుతారా..?ఎన్టీఆర్ తర్వాతే త్రివిక్రమ్ మహాభారతం మొదలుపెడుతారా..?trivikram;ntr;allu aravind;rajamouli;trivikram srinivas;india;tollywood;cinema;bahubali;producer;director;producer1;nandamuri taraka rama raoSat, 09 Jan 2021 13:00:00 GMTసినిమా రూపంలో తెరకెక్కించాలని టాలీవుడ్ లో చాలామంది దర్శక దిగ్గజాలు ప్రయత్నిస్తున్నారు.. నిర్మాత అల్లు అరవింద్ కూడా తన బ్యానర్ లో మహాభారతం ని తెరకెక్కించాలని చూస్తుండగా రాజమౌళి అయితే ఇది ఏకంగా తన డ్రీం ప్రాజెక్ట్ అని కూడా చెప్పాడు. పాన్ ఇండియా అప్పీల్ ఉన్న ఈ సినిమా ని దేశంలో చాలామంది ప్రముఖులు తెరకెక్కించాలని ముచ్చటపడుతున్నారు. అయితే ఈ సినిమా చేయాలంటే మాములు కాదు. బాహుబలి లాంటి సినిమా చేసిన రాజమౌళిసినిమా చేయాలంటే తడబడుతున్నాడు..

సినిమా చేయాలంటే తనకున్న కెపాసిటీ, నాలెడ్జ్ సరిపోదు ఇంకా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన విషయాలు చాల ఉన్నాయని స్వయంగా చెప్పారు.. అయితే ఇప్పుడు మహాభారతం ని తెరకెక్కించాలనుకున్న వారి లిస్ట్ లో టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా చేరిపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా తర్వాత అయన ఈ మహాభారతం ని తెరకెక్కించాలని చూస్తున్నారట.. అయితే మహాభారతాన్ని పురాణగాధలాగా కాకుండా సోషల్ సినిమా గా చేయనున్నారట.. రామాయ‌ణ‌, మ‌హాభార‌త ఇతిహాసాల్ని అవ‌పోసాన ప‌ట్టేసిన ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్. వాటిలో ఏ చాప్ట‌ర్ గురించి అడిగినా… త్రివిక్ర‌మ్ చెప్పేయ‌గ‌ల‌డు. త‌న సినిమాలోని సంభాష‌ణ‌ల్లో, వాటిని అసువుగా చొప్పించ‌గ‌ల‌డు. ఇప్పుడు వాటినే తెర‌పైకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడ‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల టాక్‌.

మ‌హాభార‌తాన్ని పూర్తిగా సోష‌లైజ్ చేసి సినిమా తీసే ఆలోచ‌న త్రివిక్ర‌మ్ కి ఉంద‌ట‌. అంటే యుద్ధాలు, భారీ భారీ సెట్లు ఉండ‌వంతే. పాత్ర‌లు మాత్రం క‌నిపిస్తాయి. పైగా అది మ‌హాభార‌త‌మ్ అనిచెప్ప‌డు. చూసి తెలుసుకోవాలి. అలానే రామాయ‌ణ గాథ‌నీ తెర‌కెక్కించాల‌ని వుంద‌ట‌. పూర్తిగా కాక‌పోయినా.. ప్ర‌ధాన ప‌ర్వాల్ని తీసుకుని – దాన్ని పూర్తిగా సోష‌లైజ్ చేసి తీయాల‌ని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అందులోనూ స్టార్ హీరోలే కనిపిస్తారు. మ‌రి ఈ రెండు ప్రాజెక్టులూ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతాయో చూడాలి. `కోబ‌లి` అనే స్క్రిప్టు కూడా త్రివిక్ర‌మ్ ద‌గ్గ‌ర రెడీగా ఉంది. దాన్ని కూడా తెర‌పై చూసుకోవాల‌న్న‌ది త‌న ఆశ‌.


వైసీపీపై లోకేశ్ దూకుడు

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>