PoliticsSiva Prasadeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrad142673-a9c7-4e06-8dc1-5bf386edb845-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrad142673-a9c7-4e06-8dc1-5bf386edb845-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తున్నారు. బల్దియా ఎన్నికల అనంతరం నుంచి ప్రజల శ్రేయస్సు కోసం వడివడిగా అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.kcr;kcr;srinivas;sathwara;chief minister;minister;thota chandrasekhar;ballariగొర్రెల పంపిణీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్గొర్రెల పంపిణీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్kcr;kcr;srinivas;sathwara;chief minister;minister;thota chandrasekhar;ballariSat, 09 Jan 2021 14:02:56 GMTముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజా సంక్షేమంపై దృష్టి సారిస్తున్నారు. బల్దియా ఎన్నికల అనంతరం నుంచి ప్రజల శ్రేయస్సు కోసం వడివడిగా అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేపట్టగా మొదటి విడత చివరి దశలో కరోనా వల్ల పంపిణీ నిలిచిపోయింది. దాదాపు 30 వేల మందికి పైగా డీడీలు కట్టి ఉన్నారు. వారందరికీ తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, అధికారులను సిఎం ఆదేశించారు.
              వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో దీనికి సంబంధించి నిధులు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కొన్నేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో మొదటి విడతలో 3,65,000 మందికి పైగా 78 లక్షల గొర్రెలు ఇచ్చింది. అయితే ఆ తరువాత రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. రెండో విడతలో 3.61 లక్షల మంది లబ్ధిదారులకు 75.98 లక్షల గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 6 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు గతంలో అధికారులు వెల్లడించారు.
అయితే గొర్రెల పంపిణీపై ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు అందాయి. దీంతో ఒకటి పాత పద్ధతిలోనే గొర్రెలను కొనుగోలు చేయడం లేదా టెండర్ల ప్రక్రియ చేపట్టి పంపిణీ లేదా రాయితీని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో వేయడం వంటి అంశాలపై పరిశీలన చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని సతారా, సాంఘి, షోలాపూర్, నాందేడ్, కర్ణాటకలోని బళ్లారి, చిత్రదుర్గ, దావణగిరి, బీదర్, గుల్‌బర్గా ప్రాంతాల నుంచి దక్కణీ జాతి గొర్రెలు సేకరించనున్నట్టు తెలుస్తోంది.


అప్పుడు వద్దన్నాడు.... ఇప్పుడేమో కంగారు పడుతున్నాడు...!

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva Prasad]]>