PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavanadf4d5e5-8c88-48e6-948b-4bda5bdfe6e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavanadf4d5e5-8c88-48e6-948b-4bda5bdfe6e2-415x250-IndiaHerald.jpg పవన్ కళ్యాణ్ పర్యటన అంటే చాలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో ఎక్కడ లేని టెన్షన్ మొదలవుతోంది. సమస్య ఎక్కడ ఉంది అంటే చాలు ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఓ వైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ.. మరో వైపు ప్రజల్లోకి జనసేన పార్టీని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలులో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు అక్కడ పర్యటించాలని పవన్‌ నిర్ణయించారు.... pavan;pawan;kalyan;godavari river;andhra pradesh;janasena;east;industries;east godavari;government;police;village;local language;janasena party;tuniఏపీ లో పవన్ కళ్యాణ్ పర్యటన... ప్రభుత్వమే టార్గెట్....!?ఏపీ లో పవన్ కళ్యాణ్ పర్యటన... ప్రభుత్వమే టార్గెట్....!?pavan;pawan;kalyan;godavari river;andhra pradesh;janasena;east;industries;east godavari;government;police;village;local language;janasena party;tuniSat, 09 Jan 2021 12:35:23 GMT



పవన్ కళ్యాణ్ పర్యటన అంటే చాలు ఈ మధ్య కాలంలో ప్రభుత్వంలో ఎక్కడ లేని టెన్షన్ మొదలవుతోంది. సమస్య ఎక్కడ ఉంది అంటే చాలు ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఓ వైపు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ.. మరో వైపు ప్రజల్లోకి జనసేన పార్టీని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం వలసపాకలులో దివిస్‌ పరిశ్రమ ఏర్పాటును నిరసిస్తూ స్థానికులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతు తెలిపేందుకు అక్కడ పర్యటించాలని పవన్‌ నిర్ణయించారు....



ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో తుని నియోజకవర్గం పరిధిలోకి వచ్చే దివీస్‌ ల్యాబొరేటరీస్‌ పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు మరోసారి ఉదృతమయ్యాయి. ఫార్మా యూనిట్ల ఏర్పాటు కోసం జోరుగా ప్రయత్నాలు సాగుతున్న నేపథ్యంలో స్ధానికుల ఆందోళనలు పెరిగాయి. దీంతో స్ధానికంగా జరుగుతున్న నిరసనలకు మద్దతు ప్రకటించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఇవాళ తూర్పుగోదావరి వెళ్లనున్నారు.వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మత్స్యకారులు, దళితులు, ఆ ప్రాంత ప్రజలకు మద్దతుగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు.శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నవరం నుంచి ర్యాలీగా కార్యకర్తలు, నాయకులతో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు ప్రాంతాన్ని పవన్ కళ్యాణ్  పరిశీలిస్తారు. అనంతరం తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన  ప్రసంగించనున్నారు.ఈ సభలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలపై దుమ్మెత్తిపోయడం పక్కా అని భావిస్తూ ఉన్నారు.



పవన్‌ కొత్త పాకల పర్యటనకు అనుమతిచ్చే విషయంలో పోలీసులు తీవ్ర మల్లగుల్లాలు పడ్డారు. చివరికి అనుమతి ఇచ్చారు. ముందుగా జనసేన నేతలు పవన్‌ పర్యటనకు అనుమతి నిరాకరించారు. అనంతరం ఎస్పీ అసీమ్‌ హష్మీ సెలవుపై వెళ్తున్నట్లు తెలిపారు. దింతో జనసేన నేతల విమర్శలతో తిరిగి రాత్రికే పవన్‌ సభకు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు


తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!

గుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>