Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vammo-thalli-dandrula-meeda-kopamtho-priyuditho-kalisi-darunamc9956ca2-da9d-4ddc-a280-dff1d9d45061-415x250-IndiaHerald.jpgవేధింపులు..అత్యాచారాలు.. హత్యలు.. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఆడపిల్లలకు అడుగడుగునా వేధింపుల పర్వం వెంటాడుతూనే ఉంది. ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోయింది ఆడపిల్లలకు. సృష్టికి మూలమైన ఆడపిల్లలు ప్రస్తుతం సభ్యసమాజంలో భయపడుతూనే బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి పశువాంఛ తీర్చుకునే మృగాలు ఎక్కువై పోతున్నారు నేటి సమాజంలో. దీంతో రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకుంది. ఓవైపు బయటి వారు లైంmurder;tiru;police;police station;girl;traffic police;local language;lie;katthiయువకుని దగ్గర కత్తి లాక్కుని మరి అతన్ని అక్కడ పొడిచి చంపిన యువతి.. ఎందుకో తెలుసా..?యువకుని దగ్గర కత్తి లాక్కుని మరి అతన్ని అక్కడ పొడిచి చంపిన యువతి.. ఎందుకో తెలుసా..?murder;tiru;police;police station;girl;traffic police;local language;lie;katthiSat, 09 Jan 2021 18:15:00 GMTఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి పశువాంఛ తీర్చుకునే మృగాలు ఎక్కువై పోతున్నారు నేటి సమాజంలో. దీంతో రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకుంది.



 ఓవైపు బయటి వారు లైంగిక వేధింపులకు పాల్పడుతూ అత్యాచారాలు చేసి హత్యలు చేస్తూ ఉంటే తమ సమస్యలు చెప్పుకుందాం అని ఇంట్లోకి వస్తే సొంత వారి  నుంచి కూడా  లైంగిక వేధింపులు ఎదురవుతుండడంతో ఇక తమ బాధలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోయే పరిస్థితి ఏర్పడింది ప్రతి ఆడపిల్లకు. అయితే ఆడ దానికి కోపం వస్తే అపర కాళిలా మారిపోతుంది అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఇక్కడ ఓ యువతి ఇది నిరూపించింది. అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారం చేయబోయిన ఓ నిందితుడిని దారుణంగా పొడిచి ప్రాణాలు తీసింది ఇక్కడ ఒక యువతి.



 తిరువల్లూరు జిల్లాలోని షోలవరం ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ ఘటన. 19 ఏళ్ల యువతిని ఆమె కజిన్  గత కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు.  అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురి చేసే వాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతని ఆగడాలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే ఇటీవలే యువతి కాలకృత్యాలకు వెళ్లగా మాటువేసిన సదరు కామాంధుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో అపర కాళిలా మారిపోయిన యువతి.. యువకుడు తెచ్చుకున్న కత్తిని లాక్కుని ఏకంగా అదే కత్తితో అతని శరీరంపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసింది. తర్వాత పోలీస్ స్టేషన్ కు చేరి నేరం అంగీకరించింది.  ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


జగన్ హైకోర్త్ట్ కి అందుకే వెళ్ళారా...?

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం

కలిసి పనిచేద్దామని బీజేపీకి కేటీఆర్ సూచన

మద్యంమత్తులో కన్నతల్లినే దారుణంగా !

చైనా వ్యాక్సిన్ అంత డేంజ‌రా.. ప్ర‌పంచం భ‌య‌పడే సంచ‌ల‌న నిజాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>