PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr7cb3e39d-ed91-4d8f-860a-4aac2d363c71-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr7cb3e39d-ed91-4d8f-860a-4aac2d363c71-415x250-IndiaHerald.jpgతెలంగాణ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట‌లు విన్న టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. బీజేపీ నేత‌లు ఓ వైపు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తుంటే మంత్రి శాంతంగా మాట్లాడుతూ హిత‌వులు ప‌ల‌క‌డం వారిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇంత‌కు అస‌లు విష‌యం ఏంటంటే..? తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైద‌రాబాద్‌లోని దోమలగూడలో రూ.9.90 కోట్ల వ్యయంతో నిర్మించ త‌ల‌పెట్టిన జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు కేటీఆర్ శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ శంకుస్థాపktr;ktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;government;minister;reddyబీజేపీ-టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌ల‌సిపోవాల‌న్న కేటీఆర్‌..బీజేపీ-టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు అన్న‌ద‌మ్ముల్లా క‌ల‌సిపోవాల‌న్న కేటీఆర్‌..ktr;ktr;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;g kishan reddy;government;minister;reddySat, 09 Jan 2021 13:10:59 GMTతెలంగాణ మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట‌లు విన్న టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. బీజేపీ నేత‌లు ఓ వైపు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తుంటే మంత్రి శాంతంగా మాట్లాడుతూ హిత‌వులు ప‌ల‌క‌డం వారిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇంత‌కు అస‌లు విష‌యం ఏంటంటే..? తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైద‌రాబాద్‌లోని దోమలగూడలో రూ.9.90 కోట్ల వ్యయంతో నిర్మించ త‌ల‌పెట్టిన  జీహెచ్ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలకు కేటీఆర్  శనివారం ఉదయం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్ది, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.


అనంతరం నారాయణగూడలో మోడల్‌ కూరగాయల మార్కెట్‌కు కేటీఆర్‌ భూమి పూజ చేశారు. రూ.4కోట్ల వ్యయంతో నాలుగు అంతస్తుల్లో మార్కెట్‌ నిర్మాణం చేపట్టనున్నారు.  అనంతరం అక్కడి నుంచి బాగ్‌లింగంపల్లి లంబాడితండాలో రెండు పడకగదుల ఇళ్లను కేటీఆర్‌ ప్రారంభించారు. 126 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ గో బ్యాక్‌ అంటూ భాజపా శ్రేణులు నినాదాలు చేశారు. అయితే ఈసంద‌ర్భంగా బీజేపీ నేత‌ల‌కు ఆయ‌న శాంతంగా స‌మాధానం చెప్ప‌డం టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింద‌ని స‌మాచారం. పార్టీకి, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నా.. కేటీఆర్ వారిపై మండిప‌డ‌కుండా ఉండ‌టం గ‌మ‌నార్హం.


 పైగా రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలని.. ప్రజల అభివృద్ధి కోసం మాత్రం అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవరి వాదనలు వారికే ఉండాలన్నారు. ఎన్నికల తర్వాత ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో వారందరూ కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. కానీ, అనవసర రాద్ధాంతాలు ఎందుకని బీజేపీని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. టీఆర్ఎస్-బీజేపీ అన్నదమ్ముల్లా కలిసిపోయి ప్రజల కోసం అభివృద్ధి పనులు చేయాలని హితవు పలికారు. అలాగే, కంటోన్మెంట్ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం కిషన్ రెడ్డి తన వంతు సాయం చేసి స్థలం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.




వైసీపీపై లోకేశ్ దూకుడు

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>