PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vacciene1a7e316a-7486-4174-bbfc-2e44263c523f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/covid-vacciene1a7e316a-7486-4174-bbfc-2e44263c523f-415x250-IndiaHerald.jpgభారత్ లో జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించామని కేంద్రం తెలిపింది.covid vacciene;modi;amala akkineni;kranthi;kranti;makar sakranti;hyderabad;india;narendra modi;sankranthi;january;prime minister;central government;narendraభారత్ లో జనవరి 16 నుంచి కోవిడ్ టీకాభారత్ లో జనవరి 16 నుంచి కోవిడ్ టీకాcovid vacciene;modi;amala akkineni;kranthi;kranti;makar sakranti;hyderabad;india;narendra modi;sankranthi;january;prime minister;central government;narendraSat, 09 Jan 2021 18:41:49 GMTభారత్ లో జనవరి 16 నుంచి కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారంలో మకర సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించామని కేంద్రం  తెలిపింది.  ప్రాధాన్యత క్రమంలో భాగంగా మొదట దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఆ తర్వాత 27కోట్ల మంది 50ఏళ్ల పైబడిన లేదా ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50ఏళ్ల లోపు వారికి కోవిడ్ అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

           దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోడీ  కేబినెట్‌ సెక్రటరీ, పీఎం ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం కేంద్రం ఈ ప్రకటన చేసింది.  రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ సన్నాహాల గురించి ఈ సమావేశంలో ప్రధాని మోడీ.. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.రెండు స్వదేశీ టీకాల అత్యవసర వినియోగానికి కేంద్రం ఇటీవల అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌, ఆక్స్‌ఫర్ట్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ టీకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం శుక్రవారం  దేశవ్యాప్తంగా డ్రైరన్‌ చేపట్టింది. ఈ డ్రై రన్‌ ఫలితాల ఆధారంగా టీకా పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

         దేశ వ్యాప్తంగా కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీకి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబ అన్ని రాష్ట్రాల  ప్రధాన కార్యదర్శులకు విజ్ఞప్తిచేశారు. ఇప్పటికే దేశంలోని అన్ని  ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ డ్రైరన్‌ విజయవంతమైందని తెలిపారు. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియా కాన్ఫరెన్స్‌ నిర్వహించిన రాజీవ్‌గౌబ .. వ్యాక్సిన్‌ పంపిణీని ప్రణాళిబద్దంగా అమలు చేయాలని కోరారు. 


తెలంగాణ సీఎస్ పై కేంద్రానికి కంప్లైంట్!

భారత భూభాగంలోకి చైనా సైనికుడు.. ఆర్మీ అధికారులు కీలక నిర్ణయం..?

జగన్ చేస్తున్న ఈ పనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు..?

కేసీఆర్ అందుకే హాస్పిటల్లో చేరారు

నిమ్మ‌గ‌డ్డకు షాకిచ్చేలా జ‌గ‌న్ మార్క్ న‌యా ప్లాన్‌...!

జ‌గ‌న్ తీసుకున్న ఒకే ఒక్క డెసిష‌న్‌... టీడీపీలో వ‌ణుకు పుట్టిస్తోంది..!

ఇంగితజ్ఞానం లేదా? : కేటీఆర్ పై రేవంత్ ధ్వజం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>