PoliticsHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/renu-desai-says-good-bye-to-mahesh-babu-this-is-her-responseb23d1a72-3a30-49b9-a2c7-a9ef0b9a322f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/renu-desai-says-good-bye-to-mahesh-babu-this-is-her-responseb23d1a72-3a30-49b9-a2c7-a9ef0b9a322f-415x250-IndiaHerald.jpgరేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య. కానీ పవన్ కల్యాణ్‌కు మాజీ భార్యగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెప్పించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఆమె కరోనా బారిన పడినట్టు కూడా చెప్పింది. కరోనా బారిన పడిన వారి జాబితాలో తాను కూడా ఉన్నానని ఆమె తెలిపింది. renudesai;pawan;cbn;mahesh;govinda;geetha;govi;mahesh babu;pawan kalyan;renu desai;apple;cinema;rajani kanth;wife;letter;european union;custard apple;march;chitramమహేష్ బాబుకు వదినగా రేణు దేశాయ్.. ఆమె స్పందన ఇదీ!మహేష్ బాబుకు వదినగా రేణు దేశాయ్.. ఆమె స్పందన ఇదీ!renudesai;pawan;cbn;mahesh;govinda;geetha;govi;mahesh babu;pawan kalyan;renu desai;apple;cinema;rajani kanth;wife;letter;european union;custard apple;march;chitramSat, 09 Jan 2021 15:17:13 GMTరేణు దేశాయ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య. కానీ పవన్ కల్యాణ్‌కు మాజీ భార్యగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెప్పించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఆమె కరోనా బారిన పడినట్టు కూడా చెప్పింది. కరోనా బారిన పడిన వారి జాబితాలో తాను కూడా ఉన్నానని ఆమె తెలిపింది. ఇప్పుడు ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, మళ్లీ షూటింగుల్లో పాల్గొంటున్నట్టు చెప్పారు. రైతుల బాధలపై తాను ఓ చిత్రం చేస్తున్నట్టు రేణు దేశాయ్, ఈ సినిమా మార్చి నెలలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ చిత్రాన్ని తానే స్వయంగా డైరెక్ట్ చేస్తున్నట్టు కూడా రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ బాబుకు వదినగా రేణు దేశాయ్ నటించబోతున్నారని తెగ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ రేణు దేశాయ్ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేసింది. తాను అటువంటి క్యారెక్టర్ ఏమీ చేయడం లేదని, అది కేవలం గాస్సిప్ మాత్రమేనని అన్నారు. అసలు ఇటువంటి రూమర్లు ఎలా, ఎక్కడి నుంచి పుడుతున్నాయో అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

గతంలో మేజర్ చిత్రంలో తాను ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు గాసిప్స్ వచ్చాయని, ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు చిత్రంలో నటిస్తున్నట్టు వచ్చాయని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలకు అయితే తాను ఫుల్ స్టాప్ పెట్టానని, అయితే భవిష్యత్తులో మళ్లీ పిన్ని, అత్త వంటి వార్తలను ఏమైనా పుట్టిస్తారేమో చూద్దాం అంటూ ఆమె చెప్పుకొచ్చారు. కాగా..  గీత గోవిందం వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాన్ని రూపొందించిన పరశురామ్‌ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. 


అదృష్టం అంటే ఇదే . అనుకోకుండా స్టార్ విలన్ అయ్యాడు...

రోజాకి గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ ...!?

వైసీపీపై లోకేశ్ దూకుడు

బిజెపి విషయంలో కేసీఆర్ కు ఏం చెప్పారు...?

నిమ్మగడ్డతో జగన్ కు గొడవ మంచిది కాదా...?

తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

పాపం ఏపీ అధికారులు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>