PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-govt-shocking-decision-on-private-junior-college-fee-issuec9cc6669-bf4e-4225-b29a-a419e2eb02e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-govt-shocking-decision-on-private-junior-college-fee-issuec9cc6669-bf4e-4225-b29a-a419e2eb02e3-415x250-IndiaHerald.jpgఏపీలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం ఫీజు రాయితీ భారం మోపింది. ఎలాగూ ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభిస్తుండటంతో.. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా ఫీజు రాయితీ ఇవ్వాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించి యాజమాన్యాలు పూర్తి ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్. inter colleges;suresh;jr ntr;audimulapu suresh;january;minister;application;college;gmailప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ప్రభుత్వం పిడుగు..inter colleges;suresh;jr ntr;audimulapu suresh;january;minister;application;college;gmailSat, 09 Jan 2021 12:00:00 GMTజూనియర్ కాలేజీలపై ప్రభుత్వం ఫీజు రాయితీ భారం మోపింది. ఎలాగూ ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు ఆలస్యంగా ప్రారంభిస్తుండటంతో.. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా ఫీజు రాయితీ ఇవ్వాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ధిక్కరించి యాజమాన్యాలు పూర్తి ఫీజు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

ఈనెల 18 నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాదికి ఆఫ్ ‌లైన్‌ లో మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి ఆన్ ‌లైన్లో అడ్మిషన్లు జరుపుతామని తెలిపారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 నుంచే దరఖాస్తుల విక్రయాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. దరఖాస్తుల స్వీకరణకు 17 చివరి తేదీ అని, అదే రోజు అడ్మిషన్లు కూడా పూర్తవుతాయని అన్నారు. జనవరి 8 నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు మంత్రి.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని.. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఫీజులు వసూలు చేయాలని అన్నారు మంత్రి. గతేడాది వసూలు చేసిన ఫీజులలో 30 శాతం రాయితీ ఇచ్చి, 70 శాతం మేర ఫీజులు వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసినా, కరోనా మార్గదర్శకాలను పాటించకపోయినా ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాటి గుర్తింపు సైతం రద్దుచేస్తామని హెచ్చరించారు. కాలేజీ యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తే.. 9391282578 వాట్సాప్‌ నెంబర్‌కు గాని, ourbieap@gmail.com మెయిల్ ‌కుగాని సమాచారమందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇక అడ్మిషన్ల సందర్భంగా కేవలం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ మాత్రమే చేయాలని, ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలు తమ వద్ద పెట్టుకోకూడదని చెప్పారు. పరిశీలన తర్వాత విద్యార్థులకు సర్టిఫికెట్లు తిరిగివ్వని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్ష ఫీజులు పెంచడంలేదు. మొదటి సంవత్సరం పరీక్షకు రూ.500లు, రెండో ఏడాదికి రూ.680లు చెల్లించాల్సి ఉంటుంది. 


తెరాస నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్...?

జ‌న‌సేన‌లో ఆ ఒక్క‌డి చుట్టూ రాజ‌కీయం.. రీజ‌నేంటి..?

స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్.. రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త..?

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన ఏపీ ఉద్యోగులు...!

గుడ్ న్యూస్.. చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్.. కేంద్రం కీలక నిర్ణయం..?

అమ్మ ఒడికి భారీ బ్రేక్...ఏపీ అంతటా ఎన్నికల కోడ్

ఏపీలో రాజ్యాంగ సంక్షోభం...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>