PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/reason-behind-balakrishna-sudden-entry-in-hindupur-constituency7bcdf23f-40a8-4ad1-b272-7b2941f6f9c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/reason-behind-balakrishna-sudden-entry-in-hindupur-constituency7bcdf23f-40a8-4ad1-b272-7b2941f6f9c3-415x250-IndiaHerald.jpgరెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాలకృష్ణ.. గత 19నెలలుగా హిందూపురం నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. గతంలో ఓసారి రోడ్ షో నిర్వహించి హడావిడి చేసినా.. ఆ తర్వాత పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, కనీసం అసెంబ్లీలో కూడా తన నియోజకవర్గం తరపున కానీ, పార్టీ తరపున కానీ మాట్లాడటంలేదని బాలయ్యపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. హిందూపురంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. bala krishna;lokesh;balakrishna;hyderabad;nara lokesh;cinema;government;hindupuram;mla;tdp;local language;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partyబాలకృష్ణ సడన్ ఎంట్రీ.. అసలు కారణం ఏంటి..?బాలకృష్ణ సడన్ ఎంట్రీ.. అసలు కారణం ఏంటి..?bala krishna;lokesh;balakrishna;hyderabad;nara lokesh;cinema;government;hindupuram;mla;tdp;local language;lokesh kanagaraj;nandamuri taraka rama rao;partySat, 09 Jan 2021 09:00:00 GMTహైదరాబాద్ కే పరిమితం అయ్యారు. నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, కనీసం అసెంబ్లీలో కూడా తన నియోజకవర్గం తరపున కానీ, పార్టీ తరపున కానీ మాట్లాడటంలేదని బాలయ్యపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన ఇప్పుడు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారు. హిందూపురంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు.

గత మూడు రోజులుగా హిందూపురంలో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రైతుల్ని పట్టించుకోవడంలేదని, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే చూసీ చూడనట్టు ఉంటున్నారని మండిపడ్డారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని కూడా ఆయన ఖండించారు. ఈ నేపథ్యంలో బాలయ్య సడన్ ఎంట్రీకి కారణం ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చింది. చంద్రబాబు సూచించారా, లేక నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలనుంచి ఒత్తిడి వచ్చిందా, పోనీ సినిమా షూటింగ్ లకు గ్యాప్ వచ్చిందా.. ఇదేదీ కాకుండా బాలకృష్ణే కాస్త రియలైజ్ అయ్యారా అనే వాటికి సమాధానం దొరకడంలేదు.

రాష్ట్రంలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా టీడీపీ నేతలపైనే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించిన బాలయ్య ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హిందూపురం పట్టణ పరిధిలో టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులతో కలిసి బాలకృష్ణ పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలకు అనువుకాని చోట దూరప్రాంతాల్లో స్థలం ఇచ్చి అన్యాయం చేస్తుందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరుసగా మూడు రోజులపాటు నియోజకవర్గంలోనే మకాం వేసిన బాలయ్య.. నేనున్నానంటూ స్థానికులకు భరోసా ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో చెలరేగిపోయారు. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా తయారవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీని పటిష్ట పరిచేందుకు అటు నారా లోకేష్ కానీ, ఇటు నందమూరి కుటుంబం తరపున బాలకృష్ణ కానీ ముందుకు రావడంలేదని, అందుకే వయోభారంతో ఇబ్బంది పడుతున్నా చంద్రబాబే అన్ని కార్యక్రమాలను ముందుండి చూసుకోవాల్సి వస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ యాక్టివ్ కావడంతో టీడీపీ శ్రేణులు సంతోషపడుతున్నాయి. 


అనూహ్యంగా చివరి నిమిషంలో ఆగిపోయిన 'క్రాక్' సినిమా షోలు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>