PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steps-to-bring-as-soon-as-possibleaab3d5ce-f3a4-4cd7-8cf7-08d35bbaca6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/steps-to-bring-as-soon-as-possibleaab3d5ce-f3a4-4cd7-8cf7-08d35bbaca6e-415x250-IndiaHerald.jpgకరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం. అందుకే దేశవ్యాప్తంగా మరోసారి డ్రై రన్‌కి రెడీ అయింది. ఈ సారి భారీ ఎత్తున డ్రై రన్‌ నిర్వహించనుంది. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ సమావేశమయ్యారు. టీకా పంపిణీ ఏర్పాట్లపై చర్చించారు. కరోనా వ్యాక్సిన్‌ను వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం. అందుకే దేశవ్యాప్తంగా మరోసారి డ్రై డ్రై రన్‌ నిర్వహించింది. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌లకుsteps to bring as soon as possible;modi;january;minister;central governmentవీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !steps to bring as soon as possible;modi;january;minister;central governmentFri, 08 Jan 2021 20:00:00 GMTమోడీ సర్కార్‌. అందుకే ముందుగా ఏర్పాట్లపై దృష్టి సారించింది. జనవరి రెండున దేశవ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వహించిన సర్కార్‌.. ఈ రోజు మరోసారి డ్రై రన్‌ చేపట్టింది. మొత్తం 736 జిల్లాలో ఈ ప్రక్రియను చేపట్టారు అధికారులు.

జనవరి 2న కేవలం రాష్ట్రానికి ఐదు జిల్లాల చొప్పున ఈ ప్రక్రియ చేపట్టారు. జనవరి 13న టీకాను తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ డ్రై రన్‌ ద్వారా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లపై ఓ అవగాహన ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే లక్ష మంది హెల్త్‌ వర్కర్లు డ్రైరన్‌కి సిద్ధంగా ఉన్నారని.. ఇందులో 75 వేల మంది కోవిన్‌ యాప్‌లో నమోదు చేసుకున్నట్లు తెలిపారు.

మరోవైపు టీకా పంపిణీపై అన్ని రాష్ట్రాల అధికారులతో కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ సమావేశమయ్యారు. గతంలో నిర్వహించిన డ్రై రన్‌పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అంతేకాదు.. వ్యాక్సిన్‌ఫై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. డ్రై రన్‌ సందర్భంగా కోవిడ్‌యేతర సర్వీసులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే వ్యాక్సినేషన్‌ ఉంటుందని అన్నారు.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే.. దానిని దేశంలో అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కేంద్ర సర్కార్‌. దేశ నలుమూలాల ఉన్న ప్రజలకు కరోనా టీకాను చేరవేసేందుకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలను రంగంలోకి దించనుంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు రవాణా సౌకర్యం సరిగ్గా లేని ప్రాంతాలకు భారత వైమానిక దళం విమానాలు వెళ్లనున్నాయి. సీ-130జే, అంటనోవ్‌-32 కార్గో విమానాల్లో వ్యాక్సిన్‌ను తరలించాలని నిర్ణయించింది కేంద్రం.




రాష్ట్రానికి మరోసారి విచ్చేసిన జగన్ ఆప్తమిత్రుడు 'పీకే'

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా

దేవాలయాల మీద దాడులు వెనక కుట్ర కోణం...?

నాగార్జున సాగర్ ఫలితం తర్వాతే కాంగ్రెస్ భవిష్యత్ మారబోతుందా..?

ఇకపై ప్రతీ పరీక్ష ఆన్ లైన్ లోనే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>