PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/idi-desanike-good-news-neti-nunche-vaccine-pampinica745928-3f0d-4f9b-839a-7c2ad61bec12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/idi-desanike-good-news-neti-nunche-vaccine-pampinica745928-3f0d-4f9b-839a-7c2ad61bec12-415x250-IndiaHerald.jpgకరోనా కోసం దేశం ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. వారం రోజుల్లో కరోనా వ్యాక్సిన్ తొలిదశ టీకాలు వేస్తామని ఇటీవల ప్రకటించిన కేంద్రం.. వ్యాక్సీన్ రవాణాపైనా దృష్టి పెట్టింది. దేశంలోని పుణె కేంద్రంగా ఈ వ్యాక్సిన్ల సరఫరా ఉంటుంది. ఇక్కడ నుంచి దేశవ్యాప్తంగా 41 కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తారు. ఇక అక్కడ నుంచి దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా టీకాలు సరఫరా చేస్తారు. ఇక ఈ కరోనా వ్యాక్సిన్ త్వరలోనే తొలిదశ పంపిణీ ప్రారంభం కాబోతున్నందువల్ల వ్యcorona-vaccine;telangana;software;central governmentఇది దేశానికే గుడ్‌ న్యూస్.. నేటి నుంచే వ్యాక్సిన్‌ సరఫరా..!?ఇది దేశానికే గుడ్‌ న్యూస్.. నేటి నుంచే వ్యాక్సిన్‌ సరఫరా..!?corona-vaccine;telangana;software;central governmentFri, 08 Jan 2021 06:00:00 GMT
ఇక ఈ కరోనా వ్యాక్సిన్ త్వరలోనే తొలిదశ పంపిణీ ప్రారంభం కాబోతున్నందువల్ల వ్యాక్సిన్ ప్రక్రియను మరింతగా వేగవంతం చేశారు. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా మరోసారి కరోనా డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే  1200 కేంద్రాల్లో ఈ డ్రై రన్ ని చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ డ్రై రన్ ని చేపట్టారు.

తెలంగాణ విషయానికి వస్తే.. ఇప్పటికే రాష్ట్రంలో రెండు సార్లు పూర్తి చేశారు కూడా. వ్యాక్సినేషన్ సమయంలో ఏ ఏ సమస్యలు వస్తాయన్న విషయాలను ఈ డ్రై రన్ లో పరిశీలిస్తారు. ఆ సమస్యలకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. తెలంగాణలో ఇప్పటికే 14జిల్లాల్లో సాఫ్ట్ వేర్ సమస్యలు వస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఇప్పటికే కోవిన్ సాఫ్ట్ వేర్ లో వైద్య రంగంలో పనిచేస్తున్న సుమారు 3లక్షల మంది  వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు.

ఈ డ్రై రన్‌ లో ఒక్కో వ్యాక్సిన్ కేంద్రంలో 25 మంది వాలంటీర్లు ఉంటారు. డ్రై రన్  ప్రక్రియ ప్రారంభించిన  రెండు గంటల్లో 25 మంది లబ్దిదారులకు మాక్ డ్రిల్ పూర్తి చేస్తారు. కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎలాంటి సమస్యలు లేకుండా మారుమూల ప్రాంతాల్లో సైతం వ్యాక్సిన్ అందిలా చూడాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. 


జ‌న‌వ‌రి 7వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

సిగిరెట్ తాగే వారికి భారీ షాకిచ్చిన కేంద్ర ప్రభుత్వం

వీరిద్దరూ భార్యాభర్తలు.. విడాకులు కూడా తీసుకున్నారని ఎంతమందికి తెలుసు?

అదరగొడుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్.. బాహుబలిని మించిపోయేనా..?

తెరాస పార్టీ బీజేపీ ని కాకుండా బండి ని టార్గెట్ చేయడంలో మర్మం ఏంటి..?

ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్దరించండి

తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>