MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajashker-movies2f4a602a-eb7c-4275-8ce5-b9b5dafbfcd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajashker-movies2f4a602a-eb7c-4275-8ce5-b9b5dafbfcd7-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరో హీరోయిన్లు కొన్ని కొన్ని కారణాల చేత సినిమాలను వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వారు ఏ సినిమాలు అయితే వదులుకుంటారో అవే సినిమాలు సూపర్ హిట్ విజయాలను సాధిస్తున్నాయి. అలా సూపర్ హిట్ సినిమాలను వదులుకోవడమే వారి పతనానికి మొదటి కారణం. ఇప్పటికే ఉదయ్ కిరణ్ తన భారీ విజయాలనుసాధించిన సినిమాలను వదులుకొని, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరికొంతమంది సినిమాల్లో అవకాశాలు లేకపోయినప్పటికీ కొత్తగా వారు ఏదో rajashker,movies;business;chiranjeevi;venkatesh;rana;chanti;dr rajasekhar;jeevitha rajaseskhar;kiran;raj;sekhar;shankar;teja;uday kiran;tollywood;cinema;telugu;bahubali;tamil;industry;remake;director;minister;hero;arjun 1;indian;tambi;mass;nene raju nene mantriరాజశేఖర్ "చంటి" సినిమాను ఎందుకు వదులుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!రాజశేఖర్ "చంటి" సినిమాను ఎందుకు వదులుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!rajashker,movies;business;chiranjeevi;venkatesh;rana;chanti;dr rajasekhar;jeevitha rajaseskhar;kiran;raj;sekhar;shankar;teja;uday kiran;tollywood;cinema;telugu;bahubali;tamil;industry;remake;director;minister;hero;arjun 1;indian;tambi;mass;nene raju nene mantriFri, 08 Jan 2021 13:59:00 GMTతెలుగు ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరో హీరోయిన్లు కొన్ని కొన్ని కారణాల చేత సినిమాలను  వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా వారు ఏ సినిమాలు అయితే వదులుకుంటారో అవే  సినిమాలు సూపర్ హిట్ విజయాలను సాధిస్తున్నాయి. అలా సూపర్ హిట్ సినిమాలను వదులుకోవడమే వారి పతనానికి మొదటి కారణం. ఇప్పటికే ఉదయ్ కిరణ్ తన భారీ విజయాలనుసాధించిన సినిమాలను వదులుకొని, ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరికొంతమంది సినిమాల్లో అవకాశాలు లేకపోయినప్పటికీ కొత్తగా వారు ఏదో ఒక బిజినెస్, రాజకీయం అంటూ జీవితంలో ముందుకు వెళ్తున్నారు. అలాంటివారిలో రాజశేఖర్ గారు కూడా ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే అంకుశం, మగాడు వంటి సినిమాలలో నటించి,టాలీవుడ్ ని ఒక ఊపు ఊపి అతి తక్కువ సమయంలోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినీ ఇండస్ట్రీలో ఎంత వేగంగా స్టార్ హీరోగా ఎదిగాడో, అంతేవేగంగా  కిందకి పడిపోయాడు.ఇందుకు కారణం ఒకే రకానికి చెందిన సినిమాలతో, ఒకే రకం యాక్టింగ్ చేయడంతో ప్రేక్షకులలో చూడడానికి ఇంట్రెస్ట్ రాక ఆయన పతనానికి గురయ్యాడు. అదే సమయంలో చంటి తో పాటు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను కూడా వదులుకున్నాడు రాజశేఖర్. అలా  రాజశేఖర బ్లాక్ బాస్టర్  సినిమాలు తీసి ఉంటే ఇప్పుడు అందరి హీరోలతో సమానంగా టాప్ హీరో లా ఉండేవాడేమో.  రాజశేఖర్ వదులుకున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1.చంటి :
విక్టరీ వెంకటేష్ అప్పట్లో నటించిన చంటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించడంతో పాటు వెంకటేష్ జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. చంటి సినిమా తరువాత  విక్టరీ వెంకటేష్ తన జీవితంలో ఎన్నో అద్భుత అవకాశాలను సాధించాడు. తమిళ్ లో  ప్రముఖ నటుడు ప్రభు నటించిన తంబీ  అనే సినిమా ద్వారా రీమేక్ చేయబడినది.  అప్పట్లో ఈ సినిమా తమిళ్ ఇండస్ట్రీ లో భారీ విజయాన్ని సాధించింది. అయితే అంతకుమించి విజయాన్ని తెలుగులో సాధించింది.అయితే అప్పటికే ఈ సినిమాను రాజశేఖర్ తో తీయాలనుకునే దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు.అయితే అప్పటికే యాంగ్రీ యంగ్  మ్యాన్ గా మంచి ఇమేజ్ వున్న తనని ప్రేక్షకులు ఇలాంటి రోల్ లో ఉహించుకోలేరని రిజెక్ట్ చేసారు రాజశేఖర్ గారు.

2. జెంటల్ మేన్ :
సౌత్ ఇండియన్ సెన్సేషనల్  డైరెక్టర్ శంకర్ తొలి సినిమా జెంటల్ మేన్ అప్పట్లో  ఎంత భారీ విజయాన్ని సంపాదించో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సెన్సేషనల్  హిట్ మూవీని డైరెక్టర్ శంకర్,రాజశేఖరతో  తీయాలని అనుకున్నారట. కానీ అప్పటికే రాజ్ శేఖర్  చేతి నిండా సినిమాలతో బిజీ అవడంతో ఈ సినిమా తీయడానికి ఒప్పుకోలేదట. ఈ సినిమాను అర్జున్ తో తీయించి, గొప్ప సెన్సేషనల్ హిట్ కొట్టాడు శంకర్.

3. ఠాగూర్:
మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో సెన్సేషనల్ హిట్ గా  నిలిచిన ఈ చిత్రం మొదట్లో రాజశేఖర్ తీయాలని అనుకున్నారట.అప్పట్లో తమిళ్లో సంచలనం సృష్టించిన రమణా సినిమా రీమేక్ గా ఠాగూర్ తీయబడింది. ఇప్పటికే మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చిరంజీవికి మాత్రమే ఈ సినిమాలు తీయడం సాధ్యం. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ ఈ సినిమాని తీసి ఉంటే ఫ్లాప్ అయి ఉండేది.

4. నేనే రాజు నేనే మంత్రి:
బాహుబలి సినిమా తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమా లో దగ్గుపాటి రానా నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు. అయితే దర్శకుడు తేజ ముందుగా ఈ సినిమాను  రాజశేఖర్ కోసం రాసుకున్నాడట. ఈ సినిమా కథను రాజశేఖర్ కి వినిపించినప్పుడు,రాజశేఖర్ క్లైమాక్స్ లో కొద్దిగా మార్పులు చేయమని చెప్పాడు. అది నచ్చక డైరెక్టర్ తేజ రాణా తో ఈ సినిమా తీసి బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనం సృష్టించాడు.




సెటైర్ : తొడ కొట్టమంటావా బావా..? చూచుకో నా పెతాపం !

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!

బాల‌య్య ఇదేం గోల‌య్యా... వైసీపీకి ఎంత లాభం చేశావో చూడు...!

కేంద్రంతో కేటీఆర్ యుద్ధం.. దేనికి సంకేతం..?

నేను వైసీపీ కార్యకర్తనే... మీకు అభ్యంతరం ఏంటి ? - రాపాక సంచలన వ్యాఖ్యలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>