Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime27d8c8fd-2975-4e0a-8ce0-a33fe4785c53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime27d8c8fd-2975-4e0a-8ce0-a33fe4785c53-415x250-IndiaHerald.jpgప్రాణంగా ప్రేమించాను.. పెళ్లి చేసుకోకుంటే నేను చనిపోతా.. నువ్వే నా జీవితం.. చావైనా బ్రతుకైనా నీతోనే అంటూ ప్రేమలో ఉన్న ప్రతి జంట చెప్పుకునే మాటలివే కదా.. అవును ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి కవిత్వాలే వస్తాయి మరి.. అలా ఉంటది ప్రేమలో ఉన్నప్పుడు.. ప్రేమను కాస్త పెళ్లితో ఒక్కటిచేసినప్పుడు తెలుస్తుంది వారిమధ్యన ఎలాంటి ప్రేమలు ఉప్పొంగుతాయనేది. ఆ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అనుకున్నట్టుగానే పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాతే తెలిసింది ఆ భర్త ప్రేమ ఎలాంటివాడనేది. నేను చెప్పినట్టే చెయ్యాలి.. అలా చెయ్యకు.. ఇలాగcrime;women;jeevitha rajaseskhar;manu;prema;santoshi;police;marriage;love;job;husband;wife;woman;police station;traffic police;fatherఅది వేసుకుంటే నలిగిపోతావ్ అన్న భర్త.. ఆ విషయంపై ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్అది వేసుకుంటే నలిగిపోతావ్ అన్న భర్త.. ఆ విషయంపై ఆ భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్crime;women;jeevitha rajaseskhar;manu;prema;santoshi;police;marriage;love;job;husband;wife;woman;police station;traffic police;fatherFri, 08 Jan 2021 17:26:43 GMTపెళ్లి చేసుకోకుంటే నేను చనిపోతా.. నువ్వే నా జీవితం.. చావైనా బ్రతుకైనా నీతోనే అంటూ ప్రేమలో ఉన్న ప్రతి జంట చెప్పుకునే మాటలివే కదా.. అవును ప్రేమలో ఉన్నప్పుడు ఇలాంటి కవిత్వాలే వస్తాయి మరి.. అలా ఉంటది ప్రేమలో ఉన్నప్పుడు.. ప్రేమను కాస్త పెళ్లితో ఒక్కటిచేసినప్పుడు తెలుస్తుంది వారిమధ్యన ఎలాంటి ప్రేమలు ఉప్పొంగుతాయనేది. ఆ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అనుకున్నట్టుగానే పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాతే తెలిసింది ఆ భర్త ప్రేమ ఎలాంటివాడనేది. నేను చెప్పినట్టే చెయ్యాలి.. అలా చెయ్యకు.. ఇలాగే చెయ్యి.. నీ ఇష్టాలు ఇక్కడ చెల్లవు అర్థమైందా.. నేను చెప్పినట్టే నువ్వు ఖచ్చితంగా ఉండాలంటూ ఓ భర్త వేధింపులకు గురైంది ఆ భార్య.. మాటలతో తూట్లు పొడుస్తున్న భర్త తీరుకు ఆ భార్య వేగలేకపోయింది. దాంతో ఆ షాడిస్ట్ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివారాళ్లోకి వెళితే.. అహ్మాదాబాద్ లోని సర్ఖేజ్ లో జుపుహారాకు చెందిన మహిళ(37) రెండో వివాహంగా ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేసే వ్యక్తిని పెళ్లిచేసుకుంది.


అతనికిది మూడోపెళ్లి కాగా ఆమెకు రెండో పెళ్లి.. పెళ్లికి ముందే నాకు ఎటువంటి ఆంక్షలు పెట్టొద్దు.. నాకు ఉద్యోగం చేయడం, సోషల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం  ఇష్టం. అందుకని మీరు వాటికి ఎలాంటి అభ్యంతరం తెలపకుంటేనే పెళ్లి చేసుకుందామని ఆ వ్యక్తితో చెప్పింది ఆ మహిళ. ఆమె ఇష్టాలన్నింటికీ అంగీకరించి ఆమెను మనువాడాడు ఆ వ్యక్తి. నా ఇష్టాలను గౌరవించే మంచి భర్త దొరికాడని ఆ మహిళ సంతోషించే లోపే ఆ సంతోషమంతా ఒక్కసారిగా మటుమాయమైంది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులను తట్టుకోలేక పోయింది. నువ్వు జాబ్ చెయ్యడానికి వీల్లేదు.. నువ్వు ఇంటి దగ్గరే ఉండాలి అంటూ ప్రతి రోజూ వేధించేవాడు. దానికి తోడు నువ్వు అస్సలు జీన్స్ ప్యాంట్లు వేసుకోకూడదు. అది వేసుకుంటే నువ్వు నలిగిపోతావ్.. నువ్వు అలా అవ్వడం నాకిష్టం లేదు. అందుకని నువ్వు ఈ జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం మాని జాబ్ మానేసి బుద్ధిగా ఇంట్లోనే కూర్చో అంటూ వేధించేవాడు.

అలాగే నీకు పిల్లలు కూడా పుట్టరంటూ పదేపదే అనేవాడు. దీనికి తోడు తన భార్య తండ్రి ఇచ్చిన ఇంట్లో కాకుండా సపరేట్ గా ఉందామంటూ.. నువ్వు బంధువుల ఇండ్లకు వెళ్లడానికి అస్సలు కుదరదంటూ ప్రతినిత్యం సూటిపోటి మాటలనేవాడు. ఎందుకని ఆమె ప్రశ్నించగా అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. చెప్పింది చెయ్యి అంటూ భార్యను నానా మాటలంటూ చిత్రహింసలకు గురిచేసేవాడు.  భర్తకు తోడు అత్తా మామ నుంచి కూడా వేధింపులు మొదలయ్యాయి. నీకు పిల్లలు పుట్టరు కదా.. మేం ఏది చెబితే అది నువ్వు వినాలంటూ సూటిపోటి మాటలనేవారు. ఒక పక్క భర్త వేధింపులు, మరో పక్క అత్తామామల సూటిపోటి మాటలు తట్టుకోలేకపోయింది ఆ మహిళ. దాంతో భర్త తీరుపై సర్ఖేజ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఆ భర్తపై పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 


100% ఆక్యుపెన్సీకి సాధ్యమయ్యేనా..?

ఒకేరోజు 9 ఆలయాలకు సీఎం జగన్ భూమి పూజ

ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎం లకు క్లిష్ట పరిస్థితులు...?

జీవ‌తా రాజ‌శేఖ‌ర్ ఎమ్మెల్యేగా పోటీ... ఆ సీటుపైనే గురి పెట్టారా..!

విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు చెప్పిన అఖిల‌ప్రియ‌

తెలంగాణ‌ను క‌బ‌ళిస్తోన్న బ‌ర్డ్ ఫ్లూ... కోళ్ల బిజినెస్ కుదేలు.. ఏపీలోనూ ఇంత డేంజ‌రా..?

కేజీఎఫ్ 2 టీజ‌ర్ తుస్సుమందే... యూ ట్యూబ్‌లో పేల‌లేదు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>