MoviesP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgf-chapter-2-release-date-fix06663f34-b043-4886-91f7-1ec70a8a222e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/kgf-chapter-2-release-date-fix06663f34-b043-4886-91f7-1ec70a8a222e-415x250-IndiaHerald.jpgఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ హోదా దక్కించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన తెరకెక్కించిన ‘కేజీయఫ్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న కేజీయఫ్ ఛాప్టర్ 2పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ నెట్టింట్లో ఎంతటి సునామీ సృష్టిస్తుందో తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్నారు. ఆమె కేజీయఫ్ చాప్టర్ 2లో తన ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. kgf;raveena tandon;prasanth;prashanth neel;cinema;kannada;director;tsunami;prasanth neel;prashant kishor;chitramకేజీయఫ్ - 2 సినిమాపై రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు..కేజీయఫ్ - 2 సినిమాపై రవీనా టాండన్ ఆసక్తికర వ్యాఖ్యలు..kgf;raveena tandon;prasanth;prashanth neel;cinema;kannada;director;tsunami;prasanth neel;prashant kishor;chitramFri, 08 Jan 2021 23:30:19 GMTడైరెక్టర్ హోదా దక్కించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆయన తెరకెక్కించిన ‘కేజీయఫ్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న కేజీయఫ్ ఛాప్టర్ 2పై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ నెట్టింట్లో ఎంతటి సునామీ సృష్టిస్తుందో తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్నారు. ఆమె కేజీయఫ్ చాప్టర్ 2లో తన ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రశాంత్‌ నీల్‌ ఈ కథ చెప్పే సమయానికి నేను కేజీయఫ్‌-1 చూడలేదు. తర్వాత సినిమా చూసి ఫ్యాన్‌ అయిపోయా. ఇందులో రమికాసేన్‌ పాత్ర నేనే చేయాలి అని చిత్ర బృందం అనుకుందని తెలిసి చాలా ఆనందించా. ఈ పాత్ర అంగీకరించినప్పటి నుంచి నా కోసం వాళ్ల ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇది కచ్చితంగా నా అభిమానుల మనస్సుల్లో నిలిచిపోయే పాత్ర అవుతుంది’’ అని రవీనా టాండన్‌ ధీమా వ్యక్తం చేశారు. కన్నడ స్టార్ యశ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం ఆమె ఫస్ట్‌లుక్ విడుదల అయింది.

ఈ పోస్టర్‌ను బట్టి ఆమె రాజకీయ నాయకురాలిగా నటిస్తున్నట్లు తెలిసి పోతోంది. ఈ క్రమంలోనే కేజీయఫ్ చిత్రం, దానిలో తన పాత్ర గురించి రవీనా టాండన్‌ మాట్లాడారు. ‘‘ఇందులో రమికాసేన్‌గా వైవిధ్యమైన పాత్ర చేస్తున్నా. గ్రే షేడ్స్‌ ఉండే పవర్‌ఫుల్‌ వుమెన్ క్యారెక్టర్‌ ఇది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. నా పాత్ర నెక్స్ట్‌ సీన్‌లో ఎలా బిహేవ్‌ చేస్తుందో ఎవరూ ఊహించలేరు. అంత గ్రిప్పింగ్‌గా స్ర్కీన్‌ప్లే ఉంది. ఈ చిత్రంలో నా పాత్ర చూస్తే అభిమానులకు పండగే. యశ్‌ జెమ్‌లాంటి వ్యక్తి. ఎంత ప్రతిభావంతుడో, అంత మంచివాడు. ప్రశాంత్‌ నీల్‌ మేకింగ్‌లో న్యూ ఏజ్‌ అప్రోచ్‌ కనిపించింది. చూడ్డానికి ప్రశాంతంగా కనిపించే ఆయనలో ఆలోచనలు ప్రవాహంలా సాగుతాయని ఎవరూ అనుకోరు. అతని కలలు, ఆలోచనలు.. సామాన్యులకు ఊహలకు అందనంత ఎత్తులో ఉంటాయి. ఈ సినిమా చేయను అని చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు’’ అని టాండన్ తన కేజీయఫ్ జర్నీని వివరించారు.


ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆలయాల దాడుల మీద సిట్ ఏర్పాటు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. ఏంటంటే..

రైతు సంఘాలతో కేంద్ర సమావేశం.. ఏం మాట్లాడారంటే..

టీడీపీ నేతల బ్యాండ్ బాజా భారత్ మళ్ళీ మొదలైందా..?

వీలైనంత త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు !

అఖిల ప్రియ వ్యవహారంలో కేసీఆర్ హస్తం...?

భారత్ లో మొదలైన కరోనా టీకా సరఫరా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>